Gold and Silver Rates Today: ఆభరణాల ప్రియులకు షాకింగ్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ABN, Publish Date - Jul 11 , 2024 | 06:31 AM
ఆభరణాల ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తగ్గిన బంగారం(gold) ధరలు నేడు (జులై 11న) పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.73,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,240కి చేరింది.
ఆభరణాల ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తగ్గిన బంగారం(gold) ధరలు నేడు (జులై 11న) పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.73,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,240కి చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,520కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090కి చేరుకుంది. ఈ మేరకు ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే నేటి వెండి(silver) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.94,400 వద్ద కొనసాగుతోంది.
కీలక నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ.73,540
హైదరాబాద్లో రూ. 73,520
విజయవాడలో రూ. 73,520
చెన్నైలో రూ. 74,240
ముంబైలో రూ. 73,620
వడోదరలో రూ. 73,720
కోల్కతాలో రూ. 73,520
ప్రధాన ప్రాంతాల్లో కిలోకు వెండి ధరలు
ఢిల్లీలో రూ. 94,400
చెన్నైలో రూ. 98,900
హైదరాబాద్లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
బెంగళూరులో రూ. 93,800
కోల్కతాలో రూ. 95,200
కేరళలో రూ. 94,400
వడోదరలో రూ. 94,400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
ఎస్బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ
For Latest News and Business News click here
Updated Date - Jul 11 , 2024 | 06:42 AM