Gold and Silver Rates Today: బంపర్ ఆఫర్.. రూ. 3 వేలు తగ్గిన బంగారం ధరలు, వెండి కూడా..
ABN, Publish Date - Nov 14 , 2024 | 06:32 AM
మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పండుగల సీజన్‌లో బంగారం(gold), వెండి (silver) ధరలు వేగంగా పెరిగాయి. కానీ దీపావళి తర్వాత వీటి ధరలు తగ్గుతున్నాయి. గత రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3000 తగ్గగా, వెండి ధర కిలోకు రూ. 5 వేలు తగ్గింది. గతంలో సాధారణ బడ్జెట్ సమయంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంత భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా మళ్లీ పసిడి రేట్లు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈరోజు బంగారం ధరలు
నేడు దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 290 తగ్గి రూ.76,990కి చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.70,590కి చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,840కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,440కి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు వెయ్యి రూపాయలకుపైగా పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 76,990, రూ. 70,590
విజయవాడలో రూ. 76,840, రూ. 70,440
హైదరాబాద్‌లో రూ. 76,840, రూ. 70,440
చెన్నైలో రూ. 76,840, రూ. 70,440
వడోదరలో రూ. 76,890, రూ. 70,440
ముంబైలో రూ. 76,990, రూ. 70,590
బెంగళూరులో రూ. 76,840, రూ. 70,440
కోల్‌కతాలో రూ. 76,840, రూ. 70,440
కేరళలో రూ. 76,840, రూ. 70,440
పూణేలో రూ. 76,840, రూ. 70,440
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 90,900
హైదరాబాద్‌లో రూ. 101,100
విజయవాడలో రూ. 101,100
చెన్నైలో రూ. 101,100
కేరళలో రూ. 101,100
ముంబైలో రూ. 90,900
కోల్‌కతాలో రూ. 90,900
అహ్మదాబాద్‌లో రూ. 90,900
వడోదరలో రూ. 90,900
పాట్నాలో రూ. 90,900
బెంగళూరులో రూ. 90,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 14 , 2024 | 06:42 AM