Gold and Silver Rates Today: వెయ్యి రూపాయలు పెరిగిన వెండి, తగ్గిన పసిడి.. ఎంతకు చేరాయంటే..
ABN, Publish Date - Sep 11 , 2024 | 06:35 AM
దేశవ్యాప్తంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 11న) దేశంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 11న) దేశంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.300 తగ్గి రూ.66,910కు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,980గా ఉంది.
మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,830కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 66,760కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కిలోకు వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ చుద్దాం.
దేశంలో కీలక నగరాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 72,980, రూ. 66,910
హైదరాబాద్‌లో రూ. 72,830, రూ. 66,760
విజయవాడలో రూ. 72,830, రూ. 66,760
వడోదరలో రూ. 72,880, రూ. 66,810
బెంగళూరులో రూ. 72,830, రూ. 66,760
ముంబైలో రూ. 72,830, రూ. 66,760
చెన్నైలో రూ. 72,830, రూ. 66,760
కోల్‌కతాలో రూ. 72,830, రూ. 66,760
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 91,100
విజయవాడలో రూ. 91,100
ఢిల్లీలో రూ. 86,100
కోల్‌కతాలో రూ. 86,100
ముంబైలో రూ. 86,100
బెంగళూరులో రూ. 84,400
కేరళలో రూ. 91,100
పూణేలో రూ. 86,100
చెన్నైలో రూ. 91,100
అయోధ్యలో రూ. 86,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.
ఇవి కూడా చదవండి
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..
Read MoreBusiness News and Latest Telugu News
Updated Date - Sep 11 , 2024 | 06:45 AM