కొత్త సంవత్‌లోనూ గోల్డ్ జిగేల్
ABN, Publish Date - Nov 03 , 2024 | 02:06 AM
శుక్రవారంతో ప్రారంభమైన హిందూ సంప్రదాయ సంవత్సరం ‘సంవత్ 2081’లోనూ బంగారం ఇదే ర్యాలీని కొనసాగిస్తుందా...అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు బులియన్ మార్కె ట్ విశ్లేషకులు. ఈ సంవత్‌లోనూ బంగారం పెట్టుబడులు...
సంవత్ 2081పై విశ్లేషకుల అంచనా
ఇన్వెస్టర్లకు మళ్లీ రెండంకెల్లో రిటర్నులు!!
2025లో ఔన్సు 3,000 డాలర్లకు...
న్యూఢిల్లీ: శుక్రవారంతో ప్రారంభమైన హిందూ సంప్రదాయ సంవత్సరం ‘సంవత్ 2081’లోనూ బంగారం ఇదే ర్యాలీని కొనసాగిస్తుందా...అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు బులియన్ మార్కె ట్ విశ్లేషకులు. ఈ సంవత్‌లోనూ బంగారం పెట్టుబడులు ఇన్వెస్టర్లకు రెండకెల్లో రాబడులు అందించవచ్చు నని కేడియా క్యాపిటల్ డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం 2,750 డాలర్ల స్థాయిలో ట్రేడవుతున్న ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 2025లో 3,000 డాలర్ల స్థాయికి ఎగబాకవచ్చని అంచనా వేశారు. ‘సవంత్ 2080’ సంవత్సరంలో ఇన్వెస్టర్లకు బంగారం 32 శాతం, వెండి 39 శాతం రాబడులు అందించాయి. గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా 30 శాతం వరకు రాబడి వచ్చింది. ఈ జూలైలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం 9 శాతం తగ్గించడంతో మార్కెట్లో ధరలు 9 శాతం తగ్గినప్పటికీ, ఏడాది కాలంలో లోహం విలువ మూడో వంతు మేర పెరగడం గమనార్హం. సంవత్ 2067 (2011 తర్వాత) పసిడి ఇన్వెస్టర్లకిదే అత్యధిక రిటర్ను. కాగా, గత సంవత్‌లో సెన్సెక్స్ 25 శాతం, నిఫ్టీ 27 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయగలిగాయి.
ఆ రెండు పరిణామాలతోనే బూస్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం బంగారం ర్యాలీకి ఆజ్యం పోశాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మున్ముందు పరపతి సమీక్షల్లో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ఈ రెండు కారణాలతో పసిడి, వెండి ధరలు మరింత జోరుగా పరుగులు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి అనిశ్చితి లేదా సంక్షోభ సమయంలో అయినా భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారం నిలవడమే ఇందుకు దోహదపడుతున్న అంశం. పైగా, పసిడి-వడ్డీ రేట్లది విలోమ సంబంధం. ఫెడ్ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిరాదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్ ఫండ్స్‌కు డిమాండ్ పెరుగుతుంది.
ధర పెరుగుదల
వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్లుతుంటాయి. కాగా, చైనా ఆర్థిక, పారిశ్రామిక మందగనం నుంచి బయటపడేందుకు భారీగా ఉద్దీపనలు ప్రకటించింది. దాంతో ఆ దేశ పారిశ్రామకోత్పత్తి అవసరాలకు వెండి వినియోగం కూడా గణనీయంగా పెరగనుందని, ఫలితంగా రేటు కూడా పుంజుకోవచ్చన్న అంచనాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 03 , 2024 | 09:40 AM