ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices: అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:49 AM

మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం అతి స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ధరలు కాస్త అటుఇటుగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్: మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం అతి స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ధరలు కాస్త అటుఇటుగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది. నిన్నటిలాగే తులంపై రూ. 10 తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలెలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,290గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 73,140 వద్ద ట్రేడవుతోంది.


తెలంగాణ, ఏపీల్లో..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,140గా ట్రేడవుతోంది.

వైజాగ్‌లోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,040కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,040గా ఉంది.

వెండి ధరలూ స్వల్పమే..

బంగారం మాదిరిగానే వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. దేశంలోని చాలా నగరాల్లో కిలో వెండి రూ.100 మేర తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900గా ఉంది. ముంబయిలో రూ. 88,300, బెంగళూరులో రూ. 87,600 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,900 వద్ద ట్రేడవుతోంది.

For Latest News click here

Updated Date - Aug 31 , 2024 | 06:49 AM

Advertising
Advertising