ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు

ABN, Publish Date - Sep 30 , 2024 | 06:49 AM

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. దేశంలో ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 దిగొచ్చి.. రూ. 70,940కి చేరింది. ఆదివారం రూ.70,950గా ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. దేశంలో ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 దిగొచ్చి.. రూ. 70,940కి చేరింది. ఆదివారం రూ.70,950గా ఉంది. గ్రామ్ ధర ప్రస్తుతం 7,094గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.10 దిగొచ్చి.. రూ. 77,390గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ.77,400గా ఉండేది.1 గ్రామ్​గోల్డ్ ధర రూ. 7,739గా ఉంది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,090, 24 క్యారెట్ల ధర రూ. 77,540గా ఉంది. చెన్నైలో 22క్యారెట్లు రూ.70,940, 24 క్యారెట్ల ధర రూ. 77,390గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,094 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,390గా ఉంది. ముంబయి, పుణె, తిరువనంతపురం సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.


హైదరాబాద్‌లో..

భాగ్యనగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ధర రూ. 70,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,390 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఫెడ్​వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశంలో వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 94,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 95,000గా ఉండేది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,00,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ.​94,900, బెంగళూరులో రూ. 88,100గా ఉంది.

For Latest News and National News click here

Updated Date - Sep 30 , 2024 | 06:51 AM