Gold and Silver Rates Today: షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:38 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి ఈ ధరలను తెలుసుకుని వెళ్లండి మరి. గత వారం రేట్లను అంచనా వేసుకుని వెళ్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా మూడో రోజు కూడా రేట్లు పెరిగాయి. ఇటివల పసిడి ధర రికార్డు స్థాయిలో 80 వేల స్థాయిని దాటగా, గతవారం 76 వేల స్థాయికి దిగివచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతోపాటు స్టాక్ మార్కెట్ల ధోరణులు కూడా ఈ బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి.
నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 21న) ఉదయం 6.28 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 71,160 స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 77,780కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.71,310కి చేరాయి. ఇదే సమయంలో వెండి ధరలు కిలోకు 4000 రూపాయలు తగ్గడం విశేషం. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 77,630, రూ. 71,160
ఢిల్లీలో రూ. 77,780, రూ. 71,310
విజయవాడలో రూ. 77,630, రూ. 71,160
వడోదరలో రూ. 77,680, రూ. 71,210
చెన్నైలో రూ. 77,630, రూ. 71,160
ముంబైలో రూ. 77,630, రూ. 71,160
బెంగళూరులో రూ. 77,630, రూ. 71,160
పూణేలో రూ. 77,630, రూ. 71,160
కేరళలో రూ. 77,630, రూ. 71,160
కోల్కతాలో రూ. 77,630, రూ. 71,160
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
బెంగళూరులో రూ. 92,100
ఢిల్లీలో రూ. 92,100
హైదరాబాద్లో రూ. 100,900
విజయవాడలో రూ. 100,900
ముంబైలో రూ. 92,100
కేరళలో రూ. 100,900
చెన్నైలో రూ. 100,900
భువనేశ్వర్లో రూ. 100,900
కోల్కతాలో రూ. 92,100
అహ్మదాబాద్లో రూ. 92,100
వడోదరలో రూ. 92,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 21 , 2024 | 06:55 AM