రూ.73,000 దాటిన బంగారం
ABN, Publish Date - Apr 13 , 2024 | 02:30 AM
ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా ర్యాలీని కొనసాగించి కొత్త రికార్డులకు దూసుకుపోయాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 మేరకు పుంజుకుని రూ.73,350 వద్ద...
ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా ర్యాలీని కొనసాగించి కొత్త రికార్డులకు దూసుకుపోయాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 మేరకు పుంజుకుని రూ.73,350 వద్ద స్థిరపడింది. వెండి కిలో ధర రూ.1,400 పెరిగి రూ.86,300 వద్ద ముగిసింది. బంగారం, వెండి ధరలు రెండూ చారిత్రక గరిష్ఠ స్థాయిలే. అంతర్జాతీయ విపణిలో కూడా ఔన్సు బంగారం స్పాట్ మార్కెట్లో 48 డాలర్లు పెరిగి 2,388 డాలర్లకు చేరింది. వెండి కూడా ఔన్సు 28.95 డాలర్లు పలికింది.
Updated Date - Apr 13 , 2024 | 02:30 AM