Google Pay: జూన్ నుంచి గూగుల్ పే బంద్.. ఈ నెలలోనే మనీ డ్రా చేసుకోండి!
ABN, Publish Date - Feb 24 , 2024 | 07:20 AM
ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో గూగుల్ పేను అనేక మంది వినియోగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో బంద్ కానుంది. అవును ఇది నిజమే. జూన్ 4, 2024 నాటికి ఇది షట్‌డౌన్ చేయబడుతుందని Google తెలిపింది.
ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో గూగుల్ పే(Google Pay)ను అనేక మంది వినియోగిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో బంద్ కానుంది. అవును ఇది నిజమే. జూన్ 4, 2024 నాటికి ఇది షట్‌డౌన్ చేయబడుతుందని Google తెలిపింది. కానీ దీని సేవలు భారత్‌లో కాదు అమెరికాలో నిలిపివేయనున్నారు. అమెరికాలో 2022లో Google Wallet వచ్చిన తర్వాత 'GPay' యాప్ వాడకం తగ్గిపోయింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!
ఆ క్రమంలో ప్రతి వినియోగదారుడికి మొదటి ఎంపికగా గూగుల్ వ్యాలెట్(Google Wallet) మారింది. దీంతో అమెరికాలో పాత Google Pay యాప్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు దాని పాత వెర్షన్ పనిచేయదు. Android హోమ్‌స్క్రీన్‌లో కనిపించే 'GPay' యాప్ చెల్లింపులు, ఫైనాన్స్ కోసం ఉపయోగించబడిన పాత వెర్షన్ ఉండదు. అయితే భారతదేశం, సింగపూర్ వినియోగదారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గూగుల్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేస్తూనే ఉంటుందని పేర్కొంది. అంటే అమెరికా(america) వినియోగదారులకు ఈ యాప్ ఇక నుంచి పని చేయదు. అంతేకాదు గూగుల్ పీర్ టు పీర్ చెల్లింపులను కూడా నిలిపివేసింది. దాని సహాయంతో మాత్రమే మీరు డబ్బు పంపవచ్చు లేదా అభ్యర్థించవచ్చు.
Updated Date - Feb 24 , 2024 | 07:20 AM