ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.6,000 కోట్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్‌

ABN, Publish Date - Oct 21 , 2024 | 02:29 AM

ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించేందుకు అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా జరిగిన ఓటింగ్‌లో 98 శాతానికి పైగా వాటాదారులు...

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

న్యూఢిల్లీ: ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించేందుకు అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా జరిగిన ఓటింగ్‌లో 98 శాతానికి పైగా వాటాదారులు ఇందుకు ఆమోదం తెలిపారు. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ, క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) మార్గంలో షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా కంపెనీ ఈ నిధులు సమీకరించనుంది. గత నెల 19న జరిగిన భేటీలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3,014 కోట్లు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ/వారెంట్ల ద్వారా, రూ.3,000 కోట్లు క్యూఐపీ ద్వారా సేకరిస్తారు. ఈ నిధులను వ్యాపార విస్తరణ, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వినియోగించనుంది.

Updated Date - Oct 21 , 2024 | 02:29 AM