ఎల్ అండ్ టీ లాభంలో వృద్ధి
ABN, Publish Date - May 09 , 2024 | 05:34 AM
ఈ మార్చితో ముగిసిన త్రైమాసికానికి లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10.2 శాతం పెరిగి రూ.4,396.12 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.68,120.42 కోట్లకు...
ఒక్కో షేరుకు రూ.28 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: ఈ మార్చితో ముగిసిన త్రైమాసికానికి లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10.2 శాతం పెరిగి రూ.4,396.12 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.68,120.42 కోట్లకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్లకు పైగా కొత్త ఆర్డర్లను అందుకున్నట్లు, ఆర్డర్ బుక్ రూ.4.75 లక్షల కోట్లకు చేరుకుందని ఎల్ అండ్ టీ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) లాభం 24.72 శాతం వృద్ధితో రూ.13,059.11 కోట్లుగా, రాబడి 20.60 శాతం పెరుగుదలతో రూ.2,21,112.91 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.28 తుది డివిడెండ్ చెల్లించనున్నట్లు ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు.
Updated Date - May 09 , 2024 | 05:34 AM