కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్‌టెక్!
ABN, Publish Date - May 05 , 2024 | 06:09 AM
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సర్జికల్ సూచర్ (శస్త్రచికిత్స కుట్టు) తయారీదారు హెల్తియమ్ మెడ్‌టెక్ (గతంలో సూచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)ను అమెరికన్ గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ...
డీల్ విలువ రూ.7,000 కోట్లు!!
ముంబై: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సర్జికల్ సూచర్ (శస్త్రచికిత్స కుట్టు) తయారీదారు హెల్తియమ్ మెడ్‌టెక్ (గతంలో సూచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)ను అమెరికన్ గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ కేకేఆర్ టేకోవర్ చేయబోతోంది. బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ అపాక్స్ పార్ట్‌నర్స్ నుంచి 84 కోట్ల డాలర్ల (రూ.7,000 కోట్లు)కు హెల్తియమ్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థ కొనుగోలుకు కేకేఆర్‌తో పాటు దేశీయ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా, క్రిస్‌క్యాపిటల్ కన్సార్షియం, డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నోర్డిస్క్ ప్రమోటర్ నోవో హోల్డింగ్స్ పోటీ పడ్డాయి. అయితే, నోవో హోల్డింగ్స్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. బిడ్డింగ్‌లో మ్యాన్‌కైండ్ ఫార్మా కన్సార్షియం 78 కోట్ల డాలర్లు (రూ.6,500 కోట్లు) ఆఫర్ చేయగా.. కేకేఆర్ రూ.7,000 కోట్ల బిడ్‌తో విజేతగా నిలిచినట్లు తెలిసింది. కాగా 2022లోనూ హెల్తియమ్‌కు చెందిన యూకే అనుబంధ విభాగాన్ని కేకేఆర్ కొనుగోలు చేసింది.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెల్తియమ్ మెడ్‌టెక్ కొనుగోలుకు సంబంధించి అపాక్స్ పార్ట్‌నర్‌తో కేకేఆర్ విధిగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ డీల్‌ను సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం హెల్తియమ్ మెడ్‌టెక్‌లో అపాక్స్ పార్ట్‌నర్ 99.8ు వాటా కలిగి ఉండగా..మిగతా 0.2ు వాటాను హెల్తియమ్ సీఈఓ, ఎండీ అనీశ్ బాఫ్నా చేతిలో ఉంది. సంస్థ కేకేఆర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత హెల్తియమ్‌కు భాఫ్నాయే సార థ్యం వహించనున్నట్లు తెలిసింది. 2018లో అపాక్స్ పార్ట్‌నర్స్.. హెల్తియమ్‌ను టీపీజీ గ్రోత్, సీఎక్స్ పార్ట్‌నర్స్ నుంచి దాదాపు 30 కోట్ల డాలర్లకు (రూ.1,950 కోట్లు) కొనుగోలు చేసింది. స్మిత్ అండ్ నెఫ్యూ, జాన్సన్ అండ్ జాన్సన్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లైన ఎల్‌జీ చంద్రశేఖర్, ఎస్ సుబ్రమణియమ్ 1992లో సూచర్స్ ఇండియాను ప్రారంభించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హెల్తియమ్ రూ.820 కోట్ల ఆదాయంపై రూ.256 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆదాయం రూ.1,000 కోట్లు, నిర్వహణ లాభం రూ.350 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా.
Updated Date - May 05 , 2024 | 06:09 AM