ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మకానికి హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌!

ABN, Publish Date - Oct 08 , 2024 | 01:45 AM

సిమెంట్‌ రంగంలో స్థిరీకరణ (కన్సాలిడేషన్‌) కొనసాగుతోంది. బహుళ జాతి సిమెంట్‌ కంపెనీలు క్రమంగా భారత మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్నాయి. అదానీ గ్రూప్‌ సిమెంట్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌, కుమార మంగళం బిర్లా గ్రూప్‌ సంస్థ...

  • రేసులో అదానీ గ్రూప్‌ కంపెనీ

  • డీల్‌ విలువ రూ.10,000 కోట్లు!

న్యూఢిల్లీ: సిమెంట్‌ రంగంలో స్థిరీకరణ (కన్సాలిడేషన్‌) కొనసాగుతోంది. బహుళ జాతి సిమెంట్‌ కంపెనీలు క్రమంగా భారత మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్నాయి. అదానీ గ్రూప్‌ సిమెంట్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌, కుమార మంగళం బిర్లా గ్రూప్‌ సంస్థ అలా్ట్రటెక్‌ క్రమంగా ఈ బహుళ జాతి కంపెనీల వాటా కొనుగోలు చేస్తూ మార్కెట్‌పై పట్టు పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన హైడెల్‌బర్గ్‌ మెటీరియల్స్‌ కూడా భారత సిమెంట్‌ రంగం నుంచి తప్పుకునేందుకు నిర్ణయించింది. లిస్టెడ్‌ కంపెనీ హైడెల్‌బర్గ్‌ ఇండియా ఈక్విటీలో తనకు ఉన్న 69.39 శాతం వాటా విక్రయించేందుకు ఈ కంపెనీ అదానీ గ్రూప్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రెండు కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలు ఫలిస్తే ఈ డీల్‌ విలువ 120 కోట్ల డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లు) వరకు ఉంటుందని భావిస్తున్నారు. కాగా గత ఏడాది అలా్ట్రటెక్‌ సిమెంట్‌, జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్‌ కూడా హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ కొనుగోలుకు ప్రయత్నాలు చేశాయి.


ఇదీ ప్రస్థానం: హైడెల్‌బర్గ్‌ 2006లో మైసూర్‌ సిమెంట్‌, కొచ్చిన్‌ సిమెంట్‌ కంపెనీల కొనుగోలు ద్వారా భారత సిమెంట్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. అలాగే ఇండోరమా సిమెంట్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైడెల్‌బర్గ్‌ మెటీరియల్స్‌.. హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా అనే లిస్టెడ్‌ కంపెనీ, జువారీ సిమెంట్‌ అనే అన్‌లిస్టెడ్‌ కంపెనీల పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో జువారీ సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగుంట్ల, తెలంగాణలోని సీతాపురం వద్ద సిమెంట్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా మార్కెట్‌ క్యాప్‌ రూ.4,957 కోట్ల వరకు ఉంది. రెండు కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 140 లక్షల టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ చర్చలపై హైడెల్‌బర్గ్‌, అదానీ గ్రూప్‌ అధికారికంగా నోరు మెదపడం లేదు. హైడెల్‌బర్గ్‌ ఇండియాకు కర్ణాటకతో పాటు ఉత్తరాది మార్కెట్లలో ప్లాంట్లు ఉన్నాయి. మైసెమ్‌, జువారీ బ్రాండ్‌తో సిమెంట్‌ను విక్రయిస్తోంది.


లాభాల్లో హైడెల్‌బర్గ్‌ షేరు: ఈ వార్తలతో సోమవారం స్టాక్‌ మార్కెట్లో హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ షేరు లాభాల బాట పట్టింది. మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా బీఎ్‌సఈలో ఇంట్రాడేలో హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌ షేరు 17.95 శాతం లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.257.85ని తాకింది. చివరికి 4.03 శాతం లాభంతో రూ.227.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలోనూ ఇంట్రాడేలో 17.93 శాతం లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.258ని తాకాయి. చివరికి 3.85 శాతం లాభంతో రూ.227.19 దగ్గర క్లోజైంది. రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో 182.88 లక్షల హైడెల్‌బర్గ్‌ ఇండియా షేర్లు ట్రేడయ్యాయి.

Updated Date - Oct 08 , 2024 | 01:45 AM