ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డీ, పెనాల్టీ మినహాయింపులకు ఎలా దరఖాస్తు చేయాలి?

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:39 AM

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘వడ్డీ, పెనాల్టీ మినహాయింపు’నకు ఎవరు అర్హులో ఇంతకుముందు చెప్పుకోవటం జరిగింది. వాస్తనానికి ఇలాంటీ ఆమ్నెస్టీ పథకం గురించి జీఎ్‌సటీలో నమోదైన వ్యాపారులందరూ...

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘వడ్డీ, పెనాల్టీ మినహాయింపు’నకు ఎవరు అర్హులో ఇంతకుముందు చెప్పుకోవటం జరిగింది. వాస్తనానికి ఇలాంటీ ఆమ్నెస్టీ పథకం గురించి జీఎ్‌సటీలో నమోదైన వ్యాపారులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనకు విశేష స్పందన లభిస్తోంది. మరి ఈ ప్రయోజనం ఎలా పొందాలి? దాని విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈ ప్రయోజనం పొందటానికి కేసులను మూడు విభాగాలుగా విభజించారు. మొదటిది.. నోటీస్‌ ఇచ్చినప్పటికీ సంబంధిత ఆర్డర్‌ జారీ చేసి ఉండకూడదు. రెండోది.. ఆర్డర్‌ జారీ చేసినా దానికి సంబంధించిన అప్పీల్‌ ఆర్డర్‌ జారీ చేసి ఉండకూడదు. మూడోది.. అప్పీల్‌ ఆర్డర్‌ జారీ చేసినప్పటికీ ట్రైబ్యునల్‌ ఆర్డర్‌ జారీ చేసి ఉండకూడదు. ముందుగా చెప్పినట్లు ఈ కేసులన్నీ ‘నాన్‌ ఫ్రాడ్‌’ క్యాటగిరీ కింద ఇవ్వబడిన నోటీసులు అయ్యి ఉండాలి లేదా ‘ఫ్రాడ్‌’ క్యాటగిరీలో ఇచ్చినప్పటికీ దానిని అప్పీల్‌ లేదా పై స్థాయిలో నాన్‌ ఫ్రాడ్‌ మార్చి ఉండాలి.


మొదటి క్యాటగిరీ కేసులకు సంబంధించి వడ్డీ లేదా పెనాల్టీకి సంబంధించిన ప్రయోజనం పొందాలంటే.. ఫారమ్‌ జీఎ్‌సటీ ఎస్‌పీఎల్‌-01 అనే అప్లికేషన్‌ను సంబంధిత వివరాలు అన్ని నింపి ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. అలాగే మిగతా క్యాటగిరీకి సంబంధించిన కేసులకు ఫారమ్‌ జీఎ్‌సటీ ఎస్‌పీఎల్‌-02 దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఈ అప్లికేషన్‌ దాఖలు చేయటానికి పూర్వమే అంటే 2025 మార్చి 31 లోపు సంబంధిత ట్యాక్స్‌ చెల్లించి ఉండాలి. పన్ను కట్టిన వివరాలు, మినహాయింపు కోరే వడ్డీ, పెనాల్టీ వివరాలతో సంబంధిత దరఖాస్తును 2025 జూన్‌ 30 లోపు దాఖలు చేయాలి. అయితే కొన్ని సందర్భాలలో ఫ్రాడ్‌ క్యాటగిరీ కేసులను ‘నాన్‌ ఫ్రాడ్‌’ కేసులుగా మార్చుతూ అప్పీల్‌లో లేదా పై స్థాయిలో ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రకారం కట్టాల్సిన పన్నును ‘నాన్‌ ఫ్రాడ్‌’ కు సంబంధించిన నియమాల ప్రకారం లెక్కించి ఒక ఆర్డర్‌ను కింది స్థాయి అధికారి జారీ చేయటం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మాత్రం ఇలా ఆర్డర్‌ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలలలోపు జీఎ్‌సటీ ఎస్‌పీఎల్‌-02 ను దాఖలు చేయాల్సి ఉంటుంది.


ఇక ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అప్లికేషన్‌ దాఖలు చేసే సమయానికి ఎలాంటి అప్పీల్‌ లేదా పిటిషన్స్‌ పెండింగ్‌లో ఉండకూడదు. అలాగే కొంతమంది ఇప్పటికే సంబంధిత పన్నును అంటే ఈ ప్రకటన వెలువడటానికి పూర్వమే చెల్లించి ఉండవచ్చు. వారు కూడా దీనికి అర్హులే. ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఒకటి కంటే ఎక్కువ నోటీసులు ఇచ్చి ఉంటే ప్రతి నోటీసుకు విడివిడిగా దరఖాస్తులు దాఖలు చేయాలి. అలాగే నోటీసులో లేదా ఆర్డర్‌లో డిమాండ్‌ చేసిన పన్ను మొత్తాన్ని చెల్లించి ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి రెండు రకాల ఉల్లంఘనలకు గాను రూ.కోటి చొప్పున రూ.2 కోట్లకు డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చారనుకుందాం. దీంతోపాటు వడ్డీ, పెనాల్టీ విధించారు. ఇప్పుడు ఆ వ్యక్తి రూ.కోటి మేర వడ్డీ, పెనాల్టీ మినహాయింపు కోరుతూ ఇంకొక రూ.కోటికి అప్పీల్‌కు వెళ్లలేడు. మినహాయింపు కావాలంటే నోటీసులో ఉన్న మొత్తాన్ని చెల్లించాలి.


అలాగే ఈ మినహాయింపు 2019-20 వరకు ఉన్న ఉల్లంఘనలకే వర్తిస్తుంది. ఒకవేళ ఒకే నోటీసులో తరువాతి కాలం కూడా కలిసి ఉంటే.. ఆ తదుపరి కాలానికి సంబంధించిన పన్నును కూడా చెల్లించినప్పుడే ఈ మినహాయింపు లభిస్తుంది. కానీ, ఈ మినహాయింపు మాత్రం 2019-20 వరకు గల వడ్డీ, పెనాల్టీలకే లభిస్తుంది. తదుపరి కాలానికి వర్తించదు.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Oct 20 , 2024 | 12:39 AM