ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్లపై భారీ డిస్కౌంట్లు

ABN, Publish Date - Sep 15 , 2024 | 01:58 AM

కార్ల కంపెనీలు కస్టమర్లకు భారీగా డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. గడిచిన కొద్దినెలలుగా మార్కెట్లో కార్ల విక్రయాలు మందగించడంతో పాటు డీలర్ల వద్ద వాహన నిల్వలు ఆందోళనకర స్థాయికి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం...

పండగ సీజన్‌లో రాయితీలు, ప్రోత్సాహకాలతో కస్టమర్లకు గాలం.. విక్రయాలు తగ్గడమే కారణం

న్యూఢిల్లీ: కార్ల కంపెనీలు కస్టమర్లకు భారీగా డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. గడిచిన కొద్దినెలలుగా మార్కెట్లో కార్ల విక్రయాలు మందగించడంతో పాటు డీలర్ల వద్ద వాహన నిల్వలు ఆందోళనకర స్థాయికి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో కంపెనీలు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, హ్యుండయ్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హోండా కార్స్‌ ఈ విషయంలో మిగతా కంపెనీల కంటే ముందున్నాయి. గత నెలలో వాహన సగటు విక్రయ ధరపై 10-12 శాతం వరకు రాయితీ కల్పించిన కంపెనీలు.. ఈ నెలతో పండగ సీజన్‌ కూడా ప్రారంభం కావడంతో డిస్కౌంట్‌ స్థాయిని 12-14 శాతం వరకు పెంచాయి. కొన్ని మోడళ్లపై క్యాష్‌ డిస్కౌంట్‌, కార్పొరేట్‌ ప్రయోనాలు కలిపి రూ.3 లక్షలకు పైగా లబ్ది కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, గత నెలలో స్కార్పియో క్లాసిక్‌ ఎస్‌యూవీపై రూ.20,000కు పైగా రాయితీ కల్పించిన మహీంద్రా ఈ నెలలో డిస్కౌంట్‌ను ఏకంగా రూ.లక్ష వరకు పెంచింది.


రూ.3 లక్షల వరకు ప్రయోజనాలు: గత ఏడాది పండగ సీజన్‌లో రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు రాయితీలు అందించిన కార్ల కంపెనీలు.. ఈసారి రూ.20,000 నుంచి రూ.3.15 లక్షల స్థాయిలో డిస్కౌంట్లు, ఇతర ప్రయోనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. టాటా మోటార్స్‌ తన హైయెస్ట్‌ సెల్లింగ్‌ ఎలక్ట్రిక్‌ మోడల్‌ నెక్సాన్‌ ఈవీపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. పంచ్‌ ఈవీపై రూ.1.20 లక్షలు, టియాగో ఈవీపై రూ.40,000 రాయితీ కల్పిస్తోంది. అక్టోబరు 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, టాటా మోటార్స్‌ తన అన్ని మోడళ్ల పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వెర్షన్లకూ భారీగానే ప్రోత్సాహకాలను అందిస్తోంది. టియాగోకు రూ.65,000 స్థాయి డిస్కౌంట్‌తో మొదలుకొని సఫారీపై రూ.1.80 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది. హోండా కార్స్‌ కూడా తన మోడళ్లపై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలందిస్తోంది.


డీలర్ల వద్ద భారీగా నిల్వలు

ఆటోమొబైల్‌ డీలర్ల వద్ద కార్ల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. గత నెల చివరినాటికి డీలర్ల వద్ద నిల్వలు 7.80 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని, వాటి విలువ రూ.77,800 కోట్ల స్థాయిలో ఉంటుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) ఈ మధ్యనే వెల్లడించింది. ఈ నిల్వలు 70 రోజులకు సరిపోతాయి. ఒకవైపు విక్రయాలు మందగించడం.. మరోవైపు నెలనెలా వాహన నిల్వలు పెరుగుతూ పోతుండటంతో డీలర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఫాడా పేర్కొంది. పండగ సీజన్‌ ప్రోత్సాహకాలతోనైనా ఈ సమస్యకు కొంత ఉపశమనం లభిస్తుందని డీలర్లు ఆశావహంగా ఉన్నారు.


మోడల్‌ ప్రయోజనాలు (రూపాయల్లో)

మారుతి సుజుకీ

ఆల్టో కే 10 61,000

వ్యాగన్‌ ఆర్‌ 63,000

స్విఫ్ట్‌ 57,000

బ్రెజ్జా 42,000

బాలెనో 57,000

ఫ్రాంక్స్‌ 40,000

గ్రాండ్‌ విటారా 1.23 లక్షలు

హ్యుండయ్‌

ఐ10 నియోస్‌ 48,000

ఆరా 43,000

ఐ20 45,000

ఎక్స్‌టర్‌ 33,000

వెన్యూ 70,000

టాటా మోటార్స్‌

నెక్సాన్‌ 80,000

నెక్సాన్‌ ఈవీ 3 లక్షలు

హారియర్‌ 1.60 లక్షలు

సఫారీ 1.80 లక్షలు

మహీంద్రా

బొలెరో 86,500

బొలెరో నియో 1.34 లక్షలు

థార్‌ 1.55 లక్షలు

స్కార్పియో క్లాసిక్‌ 1.15 లక్షలు

స్కార్పియో ఎన్‌ 50,000

హోండా

ఎలివేట్‌ 75,000

సిటీ 1.14 లక్షలు

ఫోక్స్‌వేగన్‌

టైగున్‌ 1.20 లక్షలు

వర్టిస్‌ లక్ష

రెనో

ట్రైబర్‌ 50,000

క్విడ్‌ 40,000

గమనిక: కార్ల కంపెనీలు అందించే రాయితీలు, ప్రోత్సాహకాలు రాష్ట్రం, నగరాన్ని బట్టి మారుతుంటాయి. పైన పేర్కొన్నవి సగటు ప్రయోజనాలు.

Updated Date - Sep 15 , 2024 | 01:58 AM

Advertising
Advertising