ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: పర్యాటకానికి మరింత ఊతం... లక్షద్వీప్‌కు భారీ పెట్టుబడులు

ABN, Publish Date - Feb 01 , 2024 | 12:44 PM

దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతమవుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతమవుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో టైర్ 2, టైర్ 3 నగరాలను విమానాల ద్వారా అనుసంధానిస్తామని తెలిపారు. దీంతోపాటు లక్షద్వీప్‌లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని అన్నారు.


భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లే ద్వీప సమూహ దేశమైన మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం తర్వాత చాలా మంది భారతీయులు లక్షద్వీప్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. 75 వేల కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా ఇచ్చామని ప్రస్తావించారు. ఎఫ్‌డీఐలు కూడా 2014 నుంచి 2023కి భారీగా పెరిగాయని అన్నారు.

జీవ ఇంధనం కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజా రవాణా కోసం ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే సముద్ర మార్గాన్ని అనుసంధానం చేయడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తి బడ్జెట్ జూలైలో వస్తుందని నిర్మల వెల్లడించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఇందులో ప్రదర్శించనున్నారు. మౌలిక సదుపాయాల కోసం 11 శాతం ఎక్కువగా ఖర్చు చేయనున్నారు. జనాభా పెరుగుదలపై కమిటీని ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 01 , 2024 | 12:44 PM

Advertising
Advertising