మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భారీ జీతంతో పాటు వినూత్న ప్రోత్సాహకాలు

ABN, Publish Date - Jun 09 , 2024 | 03:15 AM

ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు ఉన్న ఉద్యోగులు వలస పోకుండా కాపాడుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. వారికి భారీ జీతంతో పాటు వ్యక్తిగత అభివృద్ధి...

భారీ జీతంతో పాటు వినూత్న ప్రోత్సాహకాలు

ఉద్యోగులను ఆకర్షించేందుకు

కార్పొరేట్ల సరికొత్త వ్యూహాలు

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు ఉన్న ఉద్యోగులు వలస పోకుండా కాపాడుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. వారికి భారీ జీతంతో పాటు వ్యక్తిగత అభివృద్ధికి మద్దతు, పనిలో వెసులుబాటు, తోబుట్టువులకూ ఆరోగ్య బీమా సదుపాయం వంటి వినూత్న ప్రోత్సాహకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. రిస్క్‌ అడ్వైజరీ, బ్రోకింగ్‌ కంపెనీ డబ్ల్యూటీడబ్ల్యూ ఈ ఏడాదికి గాను గ్లోబల్‌ బెనిఫిట్స్‌ ఆటిట్యూడ్‌ సర్వేను చేపట్టింది. జీతంతో పాటు లభిస్తున్న అదనపు ప్రయోజనాలే ప్రస్తుత కంపెనీలో కొనసాగుతుండటానికి ప్రధాన కారణాల్లో ఒకటని సర్వేలో పాల్గొన్న 76 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం లభిస్తున్న జీతంతోపాటు మరింత మెరుగైన ప్రయోజనాలను ఆఫర్‌ చేసే కంపెనీకి మారేందుకూ సిద్ధమని మూడింట రెండొంతుల మంది ఉద్యోగులు తెలిపారు. ప్రముఖ వినియోగదారుల ఉత్పత్తుల సంస్థ పీ అండ్‌ జీ తన ఉద్యోగులు వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ సభ్యులు, పిల్లలు, తల్లిదండ్రులు, పెంపుడు జంతువుల సంరక్షణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు వార్షిక స్థిర నగదు భత్యం ప్యాకేజీని ప్రవేశపెట్టింది. కంపెనీ సమగ్ర సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు, సిబ్బంది తమ వ్యక్తి ప్రాధాన్యాల పైనా దృష్టి సారించేందుకు ఇది దోహదపడనుందని పీ అండ్‌ జీ ఇండియా చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ అన్నారు.


కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగులు గంటల తరబడి కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. దాంతో వారికి ఊబకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పలు ఆరోగ్య సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ తన గ్రూప్‌ వ్యాపారాల ఉద్యోగుల కోసం గత ఏడాది ఆగస్టులో ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది. 33 నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆకృతి చంద్ర తెలిపారు. కొత్తగా కంపెనీలో చేరబోయేవారు జీతంతో పాటు ఆ యాజమాన్యం అందిస్తున్న బీమా సదుపాయం వంటి అదనపు సదుపాయాల గురించీ వాకబు చేస్తున్నారని శాప్‌ ఇండియా హెచ్‌ఆర్‌ హెడ్‌ శ్వేత మొహంతి అన్నారు. శాప్‌ తన సిబ్బంది మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం యెల్లో సర్కిల్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 03:15 AM

Advertising
Advertising