ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌ 10 నగరాల్లో హైదరాబాద్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:03 AM

హైదరాబాద్‌ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-10 నగరాల్లో నాలుగో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజర్‌ సావిల్స్‌.. ‘సావిల్స్‌ గ్రోత్‌ హబ్స్‌’ పేరుతో ఒక నివేదిక...

  • సావిల్స్‌ గ్రోత్‌ హబ్స్‌ నివేదిక వెల్లడి

  • భారత్‌ నుంచి 4 నగరాలకు చోటు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-10 నగరాల్లో నాలుగో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజర్‌ సావిల్స్‌.. ‘సావిల్స్‌ గ్రోత్‌ హబ్స్‌’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశం నుంచి నాలుగు నగరాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై స్థానం సంపాదించాయి. ఇందులో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో వియత్నాం.. హోచిమన్‌ సిటీ నిలవగా మూడు, ఐదు స్థానాల్లో ఢిల్లీ, ముంబై ఉన్నాయి. 2033 నాటికి గణనీయంగా పెరగనున్న జీడీపీ వృద్ధి రేటుతో పాటు ఇతరత్రా అంశాలు హైదరాబాద్‌ సహా ఇతర నగరాలు శరవేగంగా వృద్ధి చెందేందుకు దోహదపడున్నాయని నివేదిక వెల్లడించింది. తలసరి ఆదాయంలో పెరుగుదల, ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ హబ్స్‌ల్లో హైదరాబాద్‌ కీలకంగా ఉండనుందని తెలిపింది. మరోవైపు పెరుగుతున్న జనాభా, ఆదాయాలు, విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, నూతన అభివృద్ధి విధానాలు, టెక్నాలజీ, వ్యూహాత్మక ఉనికి హైదరాబాద్‌ అభివృద్ధికి దోహదపడనున్నాయని సావిల్స్‌ తెలిపింది.


యువత, అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులతో టెక్నాలజీ రంగంతో పాటు ఆర్థికాభివృద్ధిలో భాగ్యనగరం దూసుకుపోతుందని వెల్లడించింది. ఇదే సమయంలో వలసలు పెరగడంతో 2033 నాటికి ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరిస్తుందని సావిల్స్‌ అంచనా వేసింది. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు నగరాల అభివృద్ధికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం ఎంతగానో దోహదపడనుందని తెలిపింది.

Updated Date - Oct 22 , 2024 | 01:03 AM