హైదరాబాద్ రియల్టీ అదుర్స్
ABN, Publish Date - Aug 10 , 2024 | 05:56 AM
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. గత నెల (జూలై) లో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.4,266 కోట్ల విలువైన 7,124 ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు
జూలైలో 7,124 రిజిస్ట్రేషన్లు
గత ఏడాదితో పోలిస్తే 48 శాతం అప్
నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. గత నెల (జూలై) లో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.4,266 కోట్ల విలువైన 7,124 ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు విలువపరంగా 48ు, యూనిట్లపరంగా 28% పెరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే గత ఏడు నెలల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 46,368 యూనిట్ల ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 17% ఎక్కువ. ఈ రిజిస్ట్రేషన్లతో రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ ద్వారా సమకూరే ఆదాయం 40ు పెరిగి రూ.28,578 కోట్లకు చేరింది.
రూ.50 లక్షల్లోపు రిజిస్ట్రేషన్లే ఎక్కువ: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో అమ్ముడయ్యే ఇళ్లలో రూ.50 లక్షలు అంతకంటే తక్కువ ధర ఉండే ఇళ్లే ఎక్కువ. గత ఏడాది ఈ తరహా ఇళ్ల వాటా 61ు ఉంటే, ఈ ఏడాది జూలైలో ఇది 69 శాతానికి చేరిందని తెలిపింది. ఇదే సమయంలో రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 నుంచి 13 శాతానికి చేరాయి. విలువపరంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు 94ు పెరిగాయి.
Updated Date - Aug 10 , 2024 | 05:56 AM