ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీలో ఇంటరార్క్‌ కొత్త ప్లాంట్‌ ప్రారంభం

ABN, Publish Date - Sep 05 , 2024 | 02:48 AM

ఇంటరార్క్‌ బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌ కంపెనీ ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ ఉత్పత్తుల తయారీకి ఐదో ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్‌) అత్తివరంలో ప్రారంభించింది. ఇది కంపెనీకి చెందిన...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంటరార్క్‌ బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌ కంపెనీ ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ ఉత్పత్తుల తయారీకి ఐదో ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్‌) అత్తివరంలో ప్రారంభించింది. ఇది కంపెనీకి చెందిన నాల్గవ ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్‌. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ ఉత్పత్తులు, ప్రీ ఇంజనీర్డ్‌ మెటల్‌ రూఫింగ్‌, క్లాడింగ్‌ వ్యవస్థలు తయారుచేస్తారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ విస్తరించిన ఉండగా తొలి దశలో రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల ప్లాట్‌ను వినియోగించారు. దీంతో ఇంటరార్క్‌ స్థాపిత సామర్థ్యం ఏడాదికి 20 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు పెరుగుతుంది. ఈ ప్లాంట్‌ ద్వారా 250 మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ నందా తెలిపారు.


ఈ ప్లాంట్‌ను ప్రారంభించడంతో పాటు కంపెనీ రెండో దశ నిర్మాణాలకు శంకుస్థాపన కూడా చేసింది. ఈ ప్లాంట్‌ ఏడెనిమిది నెలల్లో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ దశ పూర్తయితే స్థాపిత సామర్థ్యం 40 వేల మెట్రిక్‌ టన్నులకు పెరిగి మొత్తం సామర్థ్యం 2 లక్షల ఎంటీలకు చేరుతుందని వెల్లడించింది.

Updated Date - Sep 05 , 2024 | 02:48 AM

Advertising
Advertising