ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమానయానంలో భారత్‌ నంబర్‌ 3

ABN, Publish Date - Jun 21 , 2024 | 01:32 AM

దేశంలో విమానయానం జోరందుకుంది. దేశీ య విమానయానంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది. పది సంవత్సరాల క్రితం ఐదో స్థానంలో ఉన్న భారత్‌ రెండు స్థానాలు ఎగబాకింది...

పదేళ్లలో రెండు స్థానాలు పైకి

న్యూఢిల్లీ: దేశంలో విమానయానం జోరందుకుంది. దేశీ య విమానయానంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది. పది సంవత్సరాల క్రితం ఐదో స్థానంలో ఉన్న భారత్‌ రెండు స్థానాలు ఎగబాకింది. ఓఏజీ విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది. 2014 ఏప్రిల్‌ నుంచి దశాబ్ది కాలం లో దేశీయ విమానయాన సంస్థల సామర్థ్యం రెట్టింపై 79 లక్షల నుంచి 1.55 కోట్లకు చేరింది. భారత్‌ మూడో స్థానానికి చేరడంతో బ్రెజిల్‌ 97 లక్షల సామర్థ్యంతో నాలుగో స్థానానికి, ఇండోనేషియా 92 లక్షల సామర్థ్యంతో ఐదో స్థానానికి దిగజారాయి. అయితే 8.61 కోట్ల సామర్థ్యంతో అమెరికా, 6.78 కోట్ల సామర్థ్యంతో చైనా తొలి రెండు స్థానా ల్లో చెక్కు చెదరకుండా నిలిచాయి. భారతదేశం సామర్థ్యాల జోడింపులో మాత్రం 6.9 శాతం సగటు వార్షిక వృద్ధితో టాప్‌ 5 దేశాల్లో అగ్రగామిగా ఉంది. సగటు వార్షిక సామర్థ్యాల జోడింపులో 6.3 శాతంతో చైనా, 2.4 శాతంతో అమెరికా, 1.1 శాతంతో ఇండోనేషియా వెనుకబడి ఉండగా బ్రెజిల్‌లో ఇది 0.8 శాతం క్షీణించింది.


ఇండిగో మార్కెట్‌ వాటా జూమ్‌: తక్కువ ధరల విమానయాన సంస్థలకు (ఎల్‌సీసీ) పరివర్తన విషయంలో టాప్‌ 5 దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇండిగో ఎల్‌సీసీ వృద్ధికి ఆలంబనగా ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఇండిగో మార్కెట్‌ వాటా రెట్టింపై 32 శాతం నుంచి 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యాలు ఇదే కాలంలో 13.9 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశా యి. ఇండిగో, ఎయిరిండియా విదేశాలకు విస్తరించేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని ఓఏ జీ అంటోంది. ఇండిగో ఆర్డర్‌ చేసిన 982 విమానాల్లో 96 శాతం, ఎయిరిండియా ఆర్డర్‌ చేసిన 447 విమానాల్లో 74 శాతం నారో బాడీ విమానాలేనని ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ వృద్ధికి ఊతం ఇవ్వగల విమానాశ్రయాలు భారత్‌కు ఉన్నాయా అనేది ప్రశ్నార్థకమని పేర్కొంది. దేశీయ విమానాల రాకపోకలకు అవకాశం ఉన్న విమానాశ్రయాలు అమెరికాలో 656, చైనాలో 250 ఉండగా భారత్‌లో 119 మాత్రమే ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 15.5 కోట్లుండగా 2030 నాటికి 35 కోట్లకు పెరుగుతుందని ఇండిగో అంచనా.

Updated Date - Jun 21 , 2024 | 01:32 AM

Advertising
Advertising