6 నెలల్లో రూ.87,400 కోట్లు
ABN, Publish Date - Jul 07 , 2024 | 06:20 AM
లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు విక్రయించే ట్రెండ్ ఊపందుకుంది. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో 37 కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల (1,050 కోట్ల డాలర్లు=రూ.87,400 కోట్లు) విలువైన షేర్లను విక్రయించారని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా నోట్‌లో వెల్లడించింది. ఐదేళ్లలో ఇదే అత్యధికమని
ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్రమోటర్ల వాటాల విక్రయ విలువ
ఐదేళ్లలో ఇదే అత్యధికం: కోటక్
ప్రమోటర్ల వాటాల విక్రయాలకు కారణాలు
స్టాక్ మార్కెట్ ర్యాలీతో కంపెనీలో వారి వాటా విలువ గణనీయంగా పెరగడం
వ్యాపార విస్తరణ అవసరాలు
సెబీ విధించిన కనీస పబ్లిక్ వాటా నిబంధనలు
రుణ భారం తగ్గించుకునేందుకు..
ప్రమోటర్ కుటుంబ హోల్డింగ్స్‌లో సర్దుబాటు
వ్యక్తిగత అవసరాలు
వ్యూహాత్మక వాటా సర్దుబాట్లు
ముంబై: లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు విక్రయించే ట్రెండ్ ఊపందుకుంది. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో 37 కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల (1,050 కోట్ల డాలర్లు=రూ.87,400 కోట్లు) విలువైన షేర్లను విక్రయించారని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా నోట్‌లో వెల్లడించింది. ఐదేళ్లలో ఇదే అత్యధికమని రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది టీసీఎస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), ఇండస్ టవర్స్, ఎంఫసిస్ ప్రమోటర్ల వాటాల విక్రయాలే మొత్తం విలువలో దాదాపు సగానికి సమానమని తెలిపింది. అంతేకాదు, ఈ ఏడాదిలో ప్రమోటర్ల వాటాల విక్రయాలు 2023లో నమోదైన 12.4 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్లు) స్థాయిని మించిపోవచ్చని అంటోంది.
తగ్గిన ప్రమోటర్ల వాటాలు
గత ఏడాది డిసెంబరు చివరినాటికి బీఎ్‌సఈ 200 సూచీలోని కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 42.1 శాతంగా నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి త్రైమాసికం చివరినాటికల్లా 38.8 శాతానికి తగ్గిందని కోటక్ నివేదిక తెలిపింది. అయితే, ఈ కంపెనీల్లో ప్రమోటర్లు విక్రయించిన షేర్లలో చాలావరకు వాటాను దేశీయ మ్యూచువల్ ఫండ్స్ దక్కించుకున్నాయని వెల్లడించింది.
ఆందోళనకరమా..?
కంపెనీలో ప్రమోటర్ అధిక వాటా కలిగి ఉండటం ఆ కంపెనీపై విశ్వాసానికి ప్రతీక. అయితే, ఆధునిక ఆర్థిక ప్రపంచంలో అవసరాలతో పాటూ వ్యూహాలూ మారుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. చాలా వరకు ప్రమోటర్లు వాటా విక్రయించిన సందర్భాల్లో ఆ వాటాలను దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లే కొనుగోలు చేశారు. అది మార్కెట్లో కంపెనీకి సానుకూల సంకేతమే అవుతుందని ఆనంద్ రాఠీ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ హెడ్ ప్రశాంత్ రావు అన్నారు. ప్రమోటర్లు స్వల మొత్తంలో (4-5 శాతం) వాటాలు విక్రయించడం ఆ కంపెనీ భవిష్యత్ పట్ల ఆందోళన చెందాల్సిన విషయమేమీ కాదని అన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 06:20 AM