ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్ఫీ లాభం రూ.6,506 కోట్లు

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:39 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఇన్ఫోసిస్‌ రూ.6,506 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే లాభం 4.7 శాతం అధికమిది...

ఒక్కో షేరుకు రూ.21 డివిడెండ్‌

ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా 3.75-4.50 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఇన్ఫోసిస్‌ రూ.6,506 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే లాభం 4.7 శాతం అధికమిది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోల్చినా లాభం 2.2 శాతం పెరిగింది. కాగా, ఈ క్యూ2లో ఇన్ఫీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.2 శాతం పెరిగి రూ.40,986 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ఆఽధారిత ఆదాయ వృద్ధి అంచనాను 3.75-4.50 శాతానికి పెంచింది. గత త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించిన 3-4 శాతం ఆదాయ వృద్ధి అంచనా కంటే ఎక్కువ ఇది. కంపెనీకి కీలక ఆదాయ విభాగమైన ఆర్థిక సేవల రంగంలో క్లయింట్ల డీల్స్‌ పునరుద్ధరణ ఇందుకు దోహదపడనుందని కంపెనీ అభిప్రాయపడింది. అంతేకాదు, కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను పెంచడం ఇది రెండోసారి. జూలైలోనూ అంచనాను 1-3 శాతం నుంచి 3-4 శాతానికి పెంచింది.


ఉద్యోగుల సంఖ్యలో 2,456 పెరుగుదల

వరుసగా ఆరు త్రైమాసికాలుగా తగ్గుతూ వస్తున్న ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సంఖ్యకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య నికరంగా 2,456 పెరిగి మొత్తం 3,17,788కి చేరుకుంది. అయితే, గత త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు మాత్రం 12.9 శాతానికి పెరిగింది. ఈ క్యూ1లో వలసల రేటు 12.7 శాతం గా నమోదైంది.

240 కోట్ల డాలర్ల బడా డీల్స్‌

గత త్రైమాసికంలో కంపెనీ 240 కోట్ల డాలర్ల విలువైన బడా డీల్స్‌ను దక్కించుకుంది. బడా డీల్స్‌ పుంజుకున్న నేపథ్యంలోనే కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాలను మరింత పెంచింది.


డివిడెండ్‌ రికార్డు తేదీ అక్టోబరు 29

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. డివిడెండ్‌కు అర్హులైన షేర్‌హోల్డర్లను గుర్తించేందుకు రికార్డు తేదీని అక్టోబరు 29గా నిర్ణయించింది. వచ్చే నెల 8న డివిడెండ్‌ చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు మొత్తం రూ.46 డివిడెండ్‌ చెల్లించింది.

ఈ క్యూ2లో త్రైమాసిక ప్రాతిపదికన 3.1 శాతం స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధిని నమోదు చేయగలిగాం. ఆర్థిక సేవల రంగంలో డీల్స్‌ పునరుద్ధరణ ఇందుకు దోహదపడింది. అంతేకాదు, గత మూడు నెలల్లో 240 కోట్ల డాలర్ల బడా డీల్స్‌ దక్కించుకోగలగడం మార్కెట్లో మా ప్రత్యేక స్థానాన్ని ప్రతిబింబింపజేస్తుంది.

సలీల్‌ పరేఖ్‌,

ఎండీ, సీఈఓ, ఇన్ఫోసిస్‌

Updated Date - Oct 18 , 2024 | 01:39 AM