ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐపీఓ మార్కెట్‌ కళకళ

ABN, Publish Date - Dec 17 , 2024 | 01:10 AM

ఈ నెల ప్రైమరీ మార్కెట్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌లతో (ఐపీఓ) కళకళలాడుతోంది. ఇప్పటికే నాలుగు కంపెనీల ఐపీఓలు పూర్తి కాగా.. ఇంటర్నేషనల్‌ జెమ్మోలాజికల్‌ ఇష్యూ మంగళవారంతో ముగియనుంది. తాజాగా మరో...

ఈ నెలలో ఇప్పటికే 11 ఇష్యూలు

నెలాఖరుకల్లా మరో 2-3 ఆఫర్లు!

న్యూఢిల్లీ: ఈ నెల ప్రైమరీ మార్కెట్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌లతో (ఐపీఓ) కళకళలాడుతోంది. ఇప్పటికే నాలుగు కంపెనీల ఐపీఓలు పూర్తి కాగా.. ఇంటర్నేషనల్‌ జెమ్మోలాజికల్‌ ఇష్యూ మంగళవారంతో ముగియనుంది. తాజాగా మరో 6 కంపెనీలు తమ ప్రణాళికలను ప్రకటించాయి. దాంతో సంఖ్య 11కు చేరనుంది. నెలాఖరు నాటికి మరో 2-3 కంపెనీలు కూడా ఐపీఓ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. దాంతో ఈ ఏడాదిలో అత్యధిక కంపెనీలు ఐపీఓకు వచ్చిన నెలగా డిసెంబరు నిలిచిపోనుంది. ఈ సెప్టెంబరులో 12 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. కాగా, అక్టోబరులో 6 కంపెనీలే ఇష్యూకు వచ్చినప్పటికీ, అత్యధికంగా రూ.38,689 కోట్లు సమీకరించాయి. సోమవారం ప్రణాళికలు ప్రకటించిన కంపెనీల్లో డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్‌, కాంకర్డ్‌ ఎన్విరో సిస్టమ్స్‌, ట్రాన్స్‌రైల్‌ లైటింగ్‌, సనాతన్‌ టెక్స్‌టైల్స్‌, మమత మెషినరీ ఐపీఓలు ఈనెల 19న ప్రారంభమై 23న ముగియనున్నాయి. డీఏఎం క్యాపిటల్‌ రూ.840 కోట్ల ఐపీఓ ధరల శ్రేణిని రూ.269-283గా నిర్ణయించింది.


కాంకర్డ్‌ ఐపీఓ ప్రైస్‌ బ్యాండ్‌ రూ.665-701గా ఉంది. ట్రాన్స్‌రైల్‌ లైటింగ్‌ రూ.839 కోట్ల ఇష్యూ ధరల శ్రేణి రూ.410-432గా ఉంది. సనాతన్‌ టెక్స్‌టైల్స్‌ ఐపీఓ ధరల శ్రేణిని రూ.305-321గా నిర్ణయించింది. రూ.179 కోట్ల మమత మెషినరీ ఐపీఓ ధరల శ్రేణి రూ.230-243గా ఉంది. కాగా, అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు కలిగిన వెంటివ్‌ హాస్పిటాలిటీ రూ.1,600 కోట్ల ఐపీఓ ఈనెల 20న ప్రారంభమై 24న ముగియనుంది.

  • ఆనంద్‌ రాఠీ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా సంస్థ రూ.750 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది.

Updated Date - Dec 17 , 2024 | 01:10 AM