ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీ అధికారులు వడ్డీ మాఫీ చేయవచ్చు

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:14 AM

ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్దిష్ట షరతులకు లోబడి పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేయడం లేదా తగ్గించడం చేయవచ్చని ఆ శాఖ తెలిపింది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్‌ బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు...

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్దిష్ట షరతులకు లోబడి పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేయడం లేదా తగ్గించడం చేయవచ్చని ఆ శాఖ తెలిపింది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్‌ బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు సోమవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 220 (2ఎ) కింద పన్ను చెల్లింపుదారుడు డిమాండ్‌ నోటీసు ప్రకారం పన్ను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి నెలకు ఒక శాతం వంతున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ (పీఆర్‌సీసీఐటీ) లేదా చీఫ్‌ కమిషనర్‌ (సీసీఐటీ) లేదా ప్రిన్సిపల్‌ కమిషనర్‌ (పీఆర్‌సీఐటీ), లేదా కమిషనర్‌ ర్యాంక్‌ అధికారులకు ఈ వడ్డీని మాఫీ చేయడం లేదా రద్దు చేసే అధికారం ఐటీ చట్టం దఖలు పరిచింది.

Updated Date - Nov 06 , 2024 | 01:14 AM