ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్రమత్తతే మేలు !

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:11 AM

ఈ వారం మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పటికే దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.

ఈ వారం మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పటికే దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వాల్యుయేషన్స్‌ పెరగటంతో సమీప భవిష్యత్తులో కరెక్షన్‌కు ఆస్కారం ఉంది. సూచీలు కరెక్షన్‌కు గురయితే విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తే పెట్టుబడి పెట్టొచ్చు. ఈ వారం నిఫ్టీకి 23,150 వద్ద మద్దతు స్థాయిలుండగా 23,400 వద్ద నిరోధ స్థాయిలున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ పొజిషన్లు తీసుకుంటున్నారు.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: సుదీర్ఘకాలం అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ కౌంటర్‌లో ఈ మధ్యనే దిద్దుబాటు జరిగింది. మంచి బాటమ్‌ ఏర్పడింది. గత శుక్రవారం ఈ షేరు 9.47 శాతం లాభంతో రూ.76.85 వద్ద ముగిసి ఆల్‌టైమ్‌ హై బ్రేక్‌ చేసింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.77 స్థాయిలో ప్రవేశించి రూ.85/94 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.75 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టాటా మోటార్స్‌: జీవితకాల గరిష్ఠానికి చేరిన ఈ షేరు ప్రస్తుతం కరెక్షన్‌ దశలో ఉంది. సైడ్‌వే్‌సలో సాగుతున్నప్పటికీ రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగానే ఉంది. ఈ షేరుకు రూ.950 స్థాయిలో కీలక మద్దతు లభించింది. గత శుక్రవారం ఈ షేరు 3 శాతం లాభంతో రూ.970 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.950/970 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.1,050/1,120 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.925 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

విప్రో: ఈ స్టాక్‌లో చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి పతనమవుతున్న ఈ షేరుకు రూ.441 వద్ద మద్దతు లభించింది. చివరి మూడు సెషన్లలో భారీ వాల్యూమ్స్‌తో క్యాండిల్స్‌ ఫామ్‌ అయ్యాయి. గత శుక్రవారం ఈ షేరు 5.11 శాతం లాభం తో రూ.484 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.480 శ్రేణిలో ప్రవేశించి రూ.525/555 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.460 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌: కొద్ది రోజుల క్రితం జీవితకాల గరిష్ఠాలను తాకిన ఈ షేర్లు ప్రస్తుతం స్వల్పకాల డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే చివరి మూడు సెషన్లలో బలమైన ప్రైస్‌ యాక్షన్‌ జరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ బ్రేక్‌ అయ్యింది. గత శుక్రవారం ఈ షేరు 2.89 శాతం లాభంతో రూ.6,061 వద్ద స్థిరపడింది. ఈ కౌంటర్‌లో మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు రూ.6,050 స్థాయిలో ఎంటరై రూ.6,190/6,225 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.6,010 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టైటాన్‌: ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్న ఈ షేరు ఐదు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. అయితే రూ.3,200 స్థాయిలో కీలక మద్దతు లభించింది. డబుల్‌ బాటమ్‌ ఫామ్‌ ఏర్పడింది. గత శుక్రవారం ఈ షేరు 3.68 శాతం లాభంతో రూ.3,444 వద్ద ముగియటంతో బలమైన క్యాండిల్‌ ఏర్పడింది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.3,440/3,420 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.3,650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,380 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 04:11 AM

Advertising
Advertising