ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐటీ రూటు మారింది..

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:46 AM

దేశీయ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాల విషయంలో వ్యూహం మార్చాయని స్టాఫింగ్‌ సేవల కంపెనీలంటున్నాయి. వీరిని ప్రాంగణ నియామకాలకు బదులు ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారా రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. నియామకాల సంఖ్య కంటే...

ప్రాంగణ నియామకాలకు బదులు ఆఫ్‌ క్యాంపస్‌ హైరింగ్‌కు కంపెనీల మొగ్గు

నియామకాల సంఖ్య కన్నా నాణ్యతపై దృష్టి

దేశీయ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాల విషయంలో వ్యూహం మార్చాయని స్టాఫింగ్‌ సేవల కంపెనీలంటున్నాయి. వీరిని ప్రాంగణ నియామకాలకు బదులు ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారా రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. నియామకాల సంఖ్య కంటే నాణ్యతపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని.. దాంతో ఫ్రెషర్ల ఆఫ్‌ క్యాంపస్‌ హైరింగ్‌ కనీసం 30-50 శాతం పెరిగిందని, ఈ ఏడాది మరింత పుంజుకోవచ్చని స్టాఫింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి హైరింగ్‌ ఈ ఏడాది 20-30 శాతం పెరగవచ్చని, ప్రస్తుతం 15-20 శాతం ఫ్రెషర్ల నియామకాలు ఆఫ్‌ క్యాంపస్‌ ద్వారానే జరుగుతున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ బిజినెస్‌ హెడ్‌ కృష్ణ విజ్‌ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఐటీ రంగంలో ప్రాంగణేతర నియామకాలిప్పటికే 50 శాతం పెరిగాయని, ఇది 125-150 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈలిట్మస్‌ ఎవాల్యువేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ అసీమ్‌ మార్వాహ అన్నారు.


వ్యయాలు తగ్గించుకునేందుకే..

ప్రస్తుతం ఐటీ సేవల డిమాండ్‌పై నెలకొన్న అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఆన్‌ బెంచ్‌ ఉద్యోగుల జీతభత్యాల వ్యయాలు తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల అవసరాల మేరకు ప్రాంగణేతర నియామకాలపైనే ప్రధానంగా దృష్టిసారించాయని స్టాఫింగ్‌ కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. అంతేకాదు, చాలా ఐటీ కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో భాగంగా ఇప్పటికే ఆఫర్‌ లెటర్లను జారీ చేసిన వారిని ఉద్యోగంలో చేర్చుకునే ప్రక్రియనూ వాయిదా వేస్తూ వస్తున్నాయన్నారు. అలాగే, ఉన్న ఉద్యోగులనే సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు వారు మరో కంపెనీకి వలస పోకుండా కాపాడుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుంటున్న 15 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం 10 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకోవచ్చని స్టాఫింగ్‌ కంపెనీలు తొలుత అంచనా వేశాయి. కానీ, ఈ వాటా 5-6 శాతానికి పరిమితం కావచ్చని అంచనా.


అనిశ్చితిలో 10,000 మంది ఫ్రెషర్ల భవితవ్యం

విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి ఐటీ దిగ్గజాలతోపాటు జెన్సార్‌ టెక్నాలజీస్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి మధ్య స్థాయి ఐటీ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా నియమించుకున్న 10,000కు పైగా ఫ్రెషర్లను ఇంకా ఉద్యోగంలో చేర్చుకోలేదని ఐటీ ఎంప్లాయీ యూనియన్‌ ఎన్‌ఐటీఈఎ్‌స అంటోంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు ఫ్రెషర్ల నుంచి తమకు ఫిర్యాదులందాయని ఎన్‌ఐటీఈఎ్‌స అధ్యక్షుడు హర్‌ప్రీత్‌ సింగ్‌ సలూజా అన్నారు.

కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోబోయే తేదీపై 3-4 వారాల ముందుగానే సమాచారం అందిస్తామని ఇన్ఫోసిస్‌ ఈ మధ్యనే వీరికి ఈ-మెయిల్‌ పంపినట్లు తెలిసింది. విప్రో అయితే రెండేళ్ల క్రితం ఆఫర్‌ లెటర్లు జారీ చేసిన వారినీ ఇంకా ఉద్యోగంలో చేర్చుకోలేదు. టాప్‌ ఐటీ కంపెనీలు 2022లో ఆఫర్‌ లెటర్లు జారీ చేసిన వారిలో కనీసం 3-5 శాతం ఫ్రెషర్లను ఇంకా ఉద్యోగంలో చేర్చుకోవాల్సి ఉందని కృష్ణ విజ్‌ అన్నారు.


ప్రతిభ ఆధారంగా ప్యాకేజీ

ప్రస్తుతం ఐటీ రంగంలో ఫ్రెషర్లకు రూ.3-3.5 లక్షల స్థాయిలో వార్షిక పారితోషికం లభిస్తోంది. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ కంపెనీలు మాత్రం ఫ్రెషర్లందరికీ ఒకే స్థాయి పారితోషికానికి బదులు వారి ప్రతిభ ఆధారంగా భిన్న ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి. టాలెంట్‌ టెస్ట్‌ల ద్వారా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు రూ.6.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ వార్షిక పారితోషికాన్ని అందించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఉదాహరణకు, టీసీఎస్‌ పలు కేటగిరీల్లో ఫ్రెషర్లను నియమించుకుంటోంది. అందులో నింజా విభాగం వారికి రూ.4.5-6.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఆఫర్‌ చేస్తోంది. డిజిటల్‌ కేటగిరీలో రూ.7-8 లక్షలు, ప్రైమ్‌ విభాగం వారికి రూ.9 లక్షలు, అంతకు పైగా పారితోషికం అందిస్తోంది.


నిపుణులు దొరక్క కంపెనీలు సతమతం

ఐటీ రంగంలో ఆధునిక సాంకేతికత నైపుణ్యం కలిగిన వారు లభించక కంపెనీలు సతమతం అవుతున్నాయి. సరైన నిపుణులు దొరక్క టీసీఎ్‌సలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో కంపెనీ కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోందని టీసీఎస్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ అమర్‌ షెట్యే తెలిపారు. ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు ప్రాజెక్టుల అవసరాల మేరకు లేకపోవడం, జాబ్‌ మార్కెట్లోనూ ఆధునిక సాంకేతిక నిపుణలు అందుబాటులో లేకపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నాయి.

Updated Date - Jun 16 , 2024 | 05:46 AM

Advertising
Advertising