ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు విచ్చేసిన ఇవాంక ట్రంప్

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:36 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు.

జామ్‌నగర్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఇవాంక ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇవాంక ట్రంప్ సందడి చేయనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు అంగరంగ వైభంగా జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి.


ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ పాల్గొనున్నారు. అలాగే బీపీ మాజీ సీఈఓ బాబ్ డడ్లీ, బీపీ సీఈఓ ముర్రే ఆచిన్‌క్లోస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు. కాగా డీఎల్‌ఎఫ్ సీఈఓ కుశాల్ పాల్ సింగ్ ఇప్పటికే జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యే అతిథుల జాబితాలో స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, గూగుల్ అధ్యక్షుడు డొనాల్డ్ మారిసన్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్‌పర్సన్ క్లాస్ ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 05:28 PM

Advertising
Advertising