ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అదానీ షేర్లతో ఎల్‌ఐసీకి జాక్‌పాట్‌

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:05 AM

విమర్శలు ఎలా ఉన్నా, అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)కి జాక్‌పాట్‌గా మారాయి. 2023 మార్చి 31 నాటికి అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో...

ఏడాదిలో రూ.22,739 కోట్ల లాభం

న్యూఢిల్లీ: విమర్శలు ఎలా ఉన్నా, అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)కి జాక్‌పాట్‌గా మారాయి. 2023 మార్చి 31 నాటికి అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.38,471 కోట్లుగా ఉంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.22,739 కోట్ల (59 శాతం) లాభంతో రూ.61,210 కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత కూడా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టాలన్న ఎల్‌ఐసీ నిరయం గత ఏడాది తీవ్ర విమర్శలకు లోనైంది. మరోవైపు ఈ నివేదిక దెబ్బకు ఒక దశలో 15,000 కోట్ల డాలర్ల వరకు మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయిన అదానీ గ్రూప్‌ కంపెనీలు మళ్లీ అంతే వేగంగా మదుపరులకు లాభాలు పంచాయి. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎల్‌ఐసీ.. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజె్‌సలలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు తగ్గించుకుంది. అయితే ఈ రెండు కంపెనీల షేర్ల ధరలు గత ఏడాది కాలంలో 68.4 శాతం, 83 శాతం పెరగటం గమనార్హం. అయినప్పటికీ గత ఏడాది కాలంలో అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 59 శాతం పెరగడం విశేషం.

విదేశీ మదుపరులదే హవా

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఎల్‌ఐసీ తప్ప దేశీయ సంస్థాగత మదుపరులు గానీ, రిటైల్‌ మదుపరులు గానీ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు అంటేనే భయపడ్డారు. ఈ షేర్లు కొంటే ఎక్కడ మునిగిపోతామోనని భయపడి పోయారు. అయితే అదే అదునుగా విదేశీ మదుపరులు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఖతార్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ, అబుదాబీ కేంద్రంగా పని చేసే ఐహెచ్‌సీ, ఫ్రాన్స్‌కు చెందిన ఇంధన దిగ్గజం టోటల్‌ ఎనర్జీస్‌, అమెరికా కేంద్రంగా పని చేసే పీఈ సంస్థ జీక్యూజీ ఇన్వె్‌స్టమెంట్‌ దాదాపు రూ.45,000 కోట్ల మొత్తాన్ని అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేసి మంచి లాభాలు మూటగట్టుకున్నాయి.

Updated Date - Apr 15 , 2024 | 02:05 AM

Advertising
Advertising