ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జెట్‌ ఎయిర్‌వేస్‌ దుకాణం బంద్‌

ABN, Publish Date - Nov 08 , 2024 | 06:10 AM

భారత విమానయాన రంగంలో మరో విమానయాన సంస్థ కథ ముగిసింది. పాతికేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ ఆస్తుల అమ్మకం ద్వారా తమ బకాయిల వసూలు కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన లిక్విడేషన్‌ పిటిషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

  • లిక్విడేషన్‌కు ‘సుప్రీం’ అనుమతి జూ రుణదాతలకు రూ.350 కోట్లు

న్యూఢిల్లీ: భారత విమానయాన రంగంలో మరో విమానయాన సంస్థ కథ ముగిసింది. పాతికేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ ఆస్తుల అమ్మకం ద్వారా తమ బకాయిల వసూలు కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన లిక్విడేషన్‌ పిటిషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం (జేకేసీ) డిపాజిట్‌ చేసిన రూ.200 కోట్లను, రూ.150 కోట్ల పెర్‌ఫార్మెన్స్‌ బ్యాంకు గ్యారెంటీ (పీబీజీ)ని బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ బిడ్‌లో నెగ్గిన జేకేసీ చెల్లించాల్సిన తొలి విడత మొత్తాన్ని పీబీజీ నుంచి సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియకు సంబంధించి ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. తమ తీర్పు ఇలాంటి కేసుల విచారణకు కనువిప్పుని ధర్మాసనం పేర్కొంది.


  • వాటాదారులకు రిక్త హస్తం

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈక్విటీలో 19.29 శాతం వాటా ఉన్న 1.43 లక్షల మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు చిల్లిగవ్వ కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. 2019 ఏప్రిల్‌లోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడింది. అయినా ఈ షేర్లలో ట్రేడింగ్‌ జరుగుతోంది. ఎయిర్‌లైన్‌ను మళ్లీ టేకాఫ్‌ చేయించేందుకు జేకేసీ ముందుకు రావడంతో ఈ ఏడాది మార్చి 22న జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు బీఎ్‌సఈలో రూ.63.15 స్థాయిని తాకింది. తాజాగా సుప్రీం తీర్పుతో గురువారం కంపెనీ షేరు ధర 5 శాతం నష్టంతో రూ.34.04కి స్థాయికి చేరింది. మరోవైపు మార్కెట్‌ క్యాప్‌ రూ.386.69 కోట్లకు పడిపోయింది. ఐదు శాతం సర్క్యూట్‌ బ్రేకర్‌ లేకపోతే షేరు మరింత కుప్పకూలేది. గురువారం నాటి మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా చూస్తే రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా విలువ రూ.74.6 కోట్లుగా ఉంది.

మార్కెట్ల నుంచి డీలిస్టింగ్‌ ఖాయం కావడంతో ముందు ముందు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు చిల్లిగవ్వకు కూడా కొరగావని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఈక్విటీలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు 19.29 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కి 26 శాతం, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం, నరేశ్‌ గోయల్‌ కుటుంబం, ఇతరులకు మరో 25 శాతం వాటా ఉంది.

Updated Date - Nov 08 , 2024 | 06:10 AM