శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లోకి జియో
ABN, Publish Date - Jun 14 , 2024 | 03:07 AM
త్వరలో అత్యంత వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు జియోకు మార్గం సుగమమైంది. ఈ సేవలందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన జియో ప్లాట్‌ఫామ్...
న్యూఢిల్లీ: త్వరలో అత్యంత వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు జియోకు మార్గం సుగమమైంది. ఈ సేవలందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన జియో ప్లాట్‌ఫామ్, లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్ ఏర్పాటు చేసిన ఉమ్మడి భాగస్వామ్య సంస్థ ‘ఆర్బిట్ కనెక్ట్ ఇండియా’కు భారత అంతరిక్ష నియంత్రణ మండలి ఇన్-స్పే్‌స అనుమతి మంజూరు చేసింది. ఈ కంపెనీకి శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ లైసెన్స్‌తోపాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్సును టెలికాం శాఖ ఇప్పటికే జారీ చేసింది. తాజాగా ఇన్-స్పే్‌స నుంచీ క్లియరెన్స్ లభించిన నేపథ్యంలో ట్రయల్ సేవలను ప్రారంభించేందుకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని టెలికాం శాఖను ఆర్బిట్ కనెక్ట్ కోరింది.
Updated Date - Jun 14 , 2024 | 03:07 AM