ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జియో సేవలు మరింత ప్రియం

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:18 AM

టెలికాం రంగంలో టారి్‌ఫల పెంపు మళ్లీ ప్రారంభమైంది. ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో ఇందుకు నాంది పలికింది. తన ప్లాన్స్‌లోని అన్ని మొబైల్‌ టారి్‌ఫ్సను 12 నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్టు...

27% వరకు టారి్‌ఫల పెంపు

జూలై 3 నుంచి అమల్లోకి

స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన మరునాడే వడ్డింపు

జియో బాటలో మిగతా టెల్కోలు!

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో టారి్‌ఫల పెంపు మళ్లీ ప్రారంభమైంది. ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో ఇందుకు నాంది పలికింది. తన ప్లాన్స్‌లోని అన్ని మొబైల్‌ టారి్‌ఫ్సను 12 నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జియో తన మొబైల్‌ టారి్‌ఫ్సను పెంచడం ఇదే మొదటిసారి. ‘5జీ, ఏఐ టెక్నాలజీల్లో పెట్టుబడుల ద్వారా స్థిరమైన అభివృద్ధి కోసం టారి్‌ఫలు పెంచుతున్నాం’ అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్‌ ఉచిత 5జీ సర్వీసులను కొన్ని ప్లాన్స్‌లోని కస్టమర్లకే కంపెనీ పరిమితం చేసింది. స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన మరుసటి రోజే రిలయన్స్‌ జియో టారి్‌ఫలు పెంచడం విశేషం. దీంతో మిగతా టెలికాం కంపెనీలు త్వరలోనే రిలయన్స్‌ జియోను అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


పెంపు ఇలా: ప్రస్తుతం రూ.15గా ఉన్న ఒక జీబీ డేటా యాడ్‌ ఆన్‌ ప్యాక్‌ ధరను రూ.19కు (27 శాతం) పెంచింది. 75 జీబీ పోస్ట్‌పెయిడ్‌ డేటా ప్లాన్‌ టారి్‌ఫను రూ.399 నుంచి రూ.449కి పెంచేసింది. ఇక అత్యంత ప్రజాదరణ పొంది 84 రోజులు చెల్లుబాటయ్యే రూ.666 అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ టారి్‌ఫను రూ.799కి (20 శాతం) పెంచేసింది. ఏడాది పాటు చెల్లుబాటయ్యే వార్షిక పథకాల టారిఫ్‌లనూ రూ.1,559 నుంచి రూ.1,899కి, రూ.2,999 నుంచి రూ.3,599 కి పెంచింది. రోజుకి 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ జీబీ ప్లాన్స్‌లో ఉన్న ఖాతాదారులకు అపరిమిత 5జీ డేటా లభిస్తుందని తెలిపింది.


ఉచితంగా రెండు యాప్స్‌

టారి్‌ఫల పెంపుతో పాటు తన ఖాతాదారుల కోసం రిలయన్స్‌ జియో రెండు ప్రత్యేక యాప్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. జియో సేఫ్‌, జియో ట్రాన్స్‌లేట్‌ అనే ఈ రెండు యాప్స్‌ ఏడాది పాటు జియో ప్రస్తుత ఖాతాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇందులో జియో సేఫ్‌ యాప్‌ ద్వారా సురక్షితంగా కాల్స్‌, మెసేజ్‌లు, ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్‌తో సహా అనేక పనులు చేయవచ్చని తెలిపింది. ఇక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత జియో ట్రాన్స్‌లేటర్‌యాప్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌, వాయిస్‌ మెసేజ్‌లు, టెక్స్ట్‌, ఇమేజ్‌లను వివిధ భాషల్లోకి తర్జుమా చేయవచ్చు. కొత్తగా చేరే ఖాతాదారులు మాత్రం ఈ యాప్స్‌కి నెలకు రూ.99 నుంచి రూ.199 వరకు చెల్లించాలి.

Updated Date - Jun 28 , 2024 | 04:18 AM

Advertising
Advertising