ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కావేరి సీడ్స్‌ లాభం 2.79 కోట్లు

ABN, Publish Date - May 23 , 2024 | 06:03 AM

స్థానిక కావేరి సీడ్స్‌ కంపెనీ మార్చి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి అనుబంధ కంపెనీలను మినహాయిస్తే (స్టాండ్‌ అలోన్‌) కంపెనీ రూ.80.54 కోట్ల ఆదాయంపై...

హైదరాబాద్‌: స్థానిక కావేరి సీడ్స్‌ కంపెనీ మార్చి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి అనుబంధ కంపెనీలను మినహాయిస్తే (స్టాండ్‌ అలోన్‌) కంపెనీ రూ.80.54 కోట్ల ఆదాయంపై రూ.2.79 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే క్యూ4లో కంపెనీ ఆదాయం 32.82 శాతం, నికర లాభం 1.2 రెట్లు పెరిగాయి. స్థూల లాభం 3.3 రెట్లు పెరిగి రూ.15.5 కోట్లకు చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆదాయం 6.18 శాతం పెరిగి రూ.1,062.43 కోట్లకు, నికర లాభం 9.72 శాతం వృద్ధితో రూ.293 కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరు రూ.725 చొప్పున రూ.325 కోట్లతో వాటాదారుల నుంచి 44.83 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేసినట్టు కావేరి సీడ్స్‌ సీఎండీ జీవీ భాస్కర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 06:03 AM

Advertising
Advertising