ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏసీఐ కొత్త ప్రెసిడెంట్‌గా కిశోర్‌

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:44 AM

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌, ఎస్‌జీకే కిశోర్‌ ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీ ఐ) ఆసియా పసిఫిక్‌, పశ్చిమాసియా విభాగం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు...

శంషాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి) : జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌, ఎస్‌జీకే కిశోర్‌ ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీ ఐ) ఆసియా పసిఫిక్‌, పశ్చిమాసియా విభాగం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ఆ పదవిలో రెండు సంవత్సరాల కాలం కొనసాగుతారు. విమానయాన పరిశ్రమ తదుపరి వృద్ధి పథంలోకి అడుగు పెడుతున్న ఈ వాతావరణంలో విమానాశ్రయాల ఆర్థిక, పర్యావరణ సుస్థిరతకు, ఇన్నోవేషన్‌కు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా కిశోర్‌ చెప్పారు. కిశోర్‌ను ప్రస్తుత ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయెల్‌ మెనాం టూ అభినందించారు. 47 సభ్యదేశాలకు చెందిన 600 విమానాశ్రయాలు ఏసీఐ ఏపీఏసీ అండ్‌ ఎంఐడీ పరిధిలోకి వస్తాయి. 2042 నాటికి ఈ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 340 కోట్ల నుంచి 970 కోట్లకు చేరుతుందని అంచనా.

Updated Date - Nov 03 , 2024 | 01:44 AM