ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గత నెల జీఎస్‌టీ ఆదాయం రూ.1.73 లక్షల కోట్లు

ABN, Publish Date - Jun 02 , 2024 | 02:55 AM

ఈ ఏడాది మే నెలకు వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం...

వార్షిక ప్రాతిపదికన 10% వృద్ధి ..

ఏపీ వసూళ్లు రూ.3,890 కోట్లు..

తెలంగాణలో రూ.4,986 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలకు వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు దిగుమతులు తగ్గడం ఇందుకు దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు, వృద్ధి జోరు కొనసాగింపునకు ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఏప్రిల్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతనెలకు తెలంగాణ నుంచి జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.4,986 కోట్లుగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూళ్లు 15 శాతం వృద్ధితో రూ.3,890 కోట్లుగా నమోదయ్యాయి.


మే నెల జీఎ్‌సటీ ఆదాయంలో సెంట్రల్‌ జీఎ్‌సటీ (సీజీఎ్‌సటీ) వాటా రూ.32,409 కోట్లుగా, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎ్‌సజీఎ్‌సటీ) వాటా రూ.40,265 కోట్లుగా, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎ్‌సటీ) వాటా రూ.87,781 కోట్లుగా ఉంది. సెస్సు రూపంలో మరో రూ.12,284 కోట్లు వసూలైంది. సాధారణ సెటిల్‌మెంట్‌ ప్రక్రియ లో భాగంగా రూ.67,,204 కోట్ల నికర ఐజీఎ్‌సటీ ఆదాయంలో రూ.38,519 కోట్లను సీజీఎ్‌సటీలో, రూ.32,733 కోట్లను ఎస్‌జీఎ్‌సటీలో జమ చేసింది. అనంతరం సీజీఎ్‌సటీ ఆదాయం రూ.70,928 కోట్లకు, ఎస్‌జీఎ్‌సటీ ఆదాయం రూ.72,999 కోట్లకు చేరుకుంది.


నికర వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు

స్థూల వసూళ్లలో రిఫండ్లు మినహాయించగా, గత నెలకు జీఎ్‌సటీ నికర ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1.44 లక్షల కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఏప్రిల్‌ 1తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో గడిచిన రెండు నెలలకు జీఎ్‌సటీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.3 శాతం పెరిగి రూ.3.83 లక్షల కోట్లుగా ఉంది. రిఫండ్లను మినహాయించగా, రెండు నెలలకు నికర వసూళ్లు రూ.3.36 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Updated Date - Jun 02 , 2024 | 02:55 AM

Advertising
Advertising