రెండు ఉపగ్రహాల అనుసంధానం
ABN, Publish Date - Oct 19 , 2024 | 06:31 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏటీఎల్) మరో రెండు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏటీఎల్) మరో రెండు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలో ప్రయోగించే 400 కిలోల శ్రేణిలోని రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అసెంబ్లింగ్, అనుసంధానం, టెస్టింగ్ (ఏఐటీ) పూర్తి చేసినట్టు తెలిపింది. బెంగళూరులో ఏటీఎల్‌కు చెందిన ఏరోస్పేస్ పార్కులో కంపెనీ ఈ పని పూర్తి చేసింది. ఇస్రోకు చెందిన ఈ తరహా ఉపగ్రహాలకు ఒక ప్రైవేట్ కంపెనీ ఇలాంటి సేవలు అందించడం ఇదే మొదటిసారి. గత కొద్ది సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు, సుశిక్షితులైన మానవ వనరులపై పెట్టిన పెట్టుబడులతో ఇది సాధ్యమైందని కంపెనీ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు తెలిపారు.
Updated Date - Oct 19 , 2024 | 06:31 AM