ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎంఎ్‌సఎంఈలకు 45 నిమిషాల్లో రుణం

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:10 AM

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎ్‌సఎంఈ) రుణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లూ...

ఎస్‌బీఐ వెల్లడి

10 సెకన్లలోనే రుణ దరఖాస్తుపై నిర్ణయం

ఎస్‌ఎంఈ డిజిటల్‌ లోన్స్‌ పేరుతో ప్రత్యేక పథకం

ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎ్‌సఎంఈ) రుణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లూ బ్యాంకు రుణాల వృద్ధి, లాభాలకు ఈ సంస్థలే కీలకమని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా అన్నారు. అంతేకాకుండా ఈ సంస్థల రుణ అవసరాలను వేగంగా మదింపు చేసి, రుణాలు మంజూరు చేసేందుకు ‘ఎస్‌ఎంఈ డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌’ పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం ద్వారా 10 సెకన్లలో ఎంఎ్‌సఎంఈల రుణ అర్హతను మదింపు చేసి, 45 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.


ఇవే ఆధారం: జీఎ్‌సటీ రిటర్న్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు సమర్పించే ఐటీఆర్‌లలోని వివరాల ఆధారంగా ఎస్‌బీఐ ఈ పథకం కింద ఎంఎ్‌సఎంఈల రుణ అర్హతను మదింపు చేస్తుంది. దీంతో ఎంఎ్‌సఎంఈల రుణ మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఎంఎ్‌సఎంఈల రుణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కొద్దిపాటి రిస్క్‌ ఉన్నా ఈ సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జంకడం లేదు. గత ఆర్థిక సంవత్సరం ఎస్‌బీఐ ఈ సంస్థలకు రూ.4.33 లక్షల లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం ఈ రుణ పోర్టుఫోలియోను మరింత పెంచుకోవాలని ఎస్‌బీఐ భావిస్తోంది.


రూ.25,000 కోట్ల సమీకరణకు సన్నాహాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పత్రాల జారీ ద్వారా 300 కోట్ల డాలర్లు (సుమారు రూ.25,000 కోట్లు) సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. డాలర్లు లేదా ఇంకో విదేశీ కరెన్సీ రూపంలో ఈ రుణ పత్రాల నిధుల సమీకరించేందుకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. మార్కెట్‌ పరిస్థితిని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ఈ నిధులు సమీకరిస్తారు. ఏ అవసరం కోసం ఈ రుణ పత్రాలు జారీ చేస్తోందీ ఎస్‌బీఐ వెల్లడించలేదు. ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) కూడా రూ.10,000 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.6,000 కోట్లు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా, మిగతా రూ.4,000 కోట్లు రుణ పత్రాల జారీ ద్వారా సమీకరించనుంది.

Updated Date - Jun 12 , 2024 | 02:10 AM

Advertising
Advertising