ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian stock market : -1,207 నుంచి +924 వరకు

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:52 AM

వారాంతంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీ ఒడుదుడుకులకు లోనయ్యాయి. శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌.. ఒక దశలో 1,207.14 పాయింట్లకు వరకు క్షీణించి 80,000 స్థాయికి జారుకుంది. ఆ దశలో టెలికాం, ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌, కన్స్యూమర్‌

ఇంట్రాడేలో 2,131 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌

ముంబై: వారాంతంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీ ఒడుదుడుకులకు లోనయ్యాయి. శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌.. ఒక దశలో 1,207.14 పాయింట్లకు వరకు క్షీణించి 80,000 స్థాయికి జారుకుంది. ఆ దశలో టెలికాం, ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌లో వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో సూచీలు భారీ నష్టాల నుంచి పూర్తిగా తేరుకుని లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 924 పాయింట్ల మేర వృద్ధి చెంది 82,214 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివర్లో సూచీ 843.16 పాయింట్ల లాభంతో 82,133.12 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,131 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడింది. నిఫ్టీ విషయానికొస్తే, ఆరంభ సెషన్‌లో 368 పాయింట్ల వరకు పతనమైన సూచీ మళ్లీ లాభాల్లోకి చేరుకుని 219.60 పాయింట్ల వృద్ధితో 24,768.30 వద్ద ముగిసింది. దాంతో మార్కెట్‌ సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.1.27 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.459.42 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 26 రాణించాయి. ఎయిర్‌టెల్‌ షేరు 4.39 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐటీసీ, కోటక్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ రెండు శాతానికి పైగా పెరిగాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం 0.29 శాతం వరకు నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో టెలికాం 2.13 శాతం ఎగబాకగా.. టెక్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి. బ్యాంకింగ్‌, ఐటీ సూచీలు అర శాతానికి పైగా లాభపడ్డాయి.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు పెరిగి రూ.84.80 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో లాభాలు, ధరల సూచీ తగ్గుదల వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి.

  • ఈ నెల 6తో ముగిసిన వారంలో విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు 323.5 కోట్ల డాలర్ల మేర తగ్గి 65,485.7 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

మొబిక్విక్‌ ఐపీఓకు 120 రెట్ల స్పందన

ఫిన్‌ టెక్‌ కంపెనీ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓకు భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ రూ.572 కోట్ల ఐపీఓకు ఏకంగా 119.38 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు అత్యధికంగా 134.67 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల వాటా షేర్లకు 119.50 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 108.95 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ నమోదైంది.

  • విశాల్‌ మెగామార్ట్‌ ఐపీఓ సైతం చివరి రోజు నాటికి 27.28 రెట్ల బిడ్లను ఆకర్షించగలిగింది. హైదరాబాద్‌కు చెందిన సాయి లైఫ్‌ సైన్సెస్‌ ఇష్యూ 10.26 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

  • ప్యాకేజింగ్‌ యంత్రాల తయారీదారు మమత మెషినరీ రూ.179 కోట్ల ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. ఐపీఓ షేర్ల విక్రయ ధరల శ్రేణిని కంపెనీ రూ.230-243గా నిర్ణయించింది.

Updated Date - Dec 14 , 2024 | 05:52 AM