ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లాభాల స్వీకారంతో మార్కెట్‌ డౌన్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:51 AM

చైనా ఆర్థిక మందగమన ఆందోళనలతోపాటు అమెరికా ధరల గణాంకాల విడుదల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌ బలహీనంగా ఉండటంతో దేశీయ మార్కెట్లోనూ...

చైనా ఆర్థిక మందగమన ఆందోళనలతోపాటు అమెరికా ధరల గణాంకాల విడుదల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌ బలహీనంగా ఉండటంతో దేశీయ మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లలో భారీగా లాభాలు స్వీకరించడంతో ఈక్విటీ సూచీలు ఇంట్రాడే లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 398.13 పాయింట్లు క్షీణించి 81,523.16 వద్దకు జారుకుంది. నిఫ్టీ 122.65 పాయింట్ల నష్టంతో 24,918.45 వద్ద క్లోజైంది. దాంతో సూచీ మళ్లీ 25,000 కీలక స్థాయిని కోల్పోయింది. టాటా మోటార్స్‌ షేరు ఏకంగా 5.74 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది.

Updated Date - Sep 12 , 2024 | 02:51 AM

Advertising
Advertising