ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్‌.. అదే జోరు కొత్త శిఖరాలపై సూచీలు

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:46 AM

చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్ని హెచ్చరికలు వెలువడుతున్నా ఈక్విటీ మార్కెట్లో జోరు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు రికార్డు ప్రయాణం...

ముంబై: చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్ని హెచ్చరికలు వెలువడుతున్నా ఈక్విటీ మార్కెట్లో జోరు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు రికార్డు ప్రయాణం కొనసాగించాయి. మెటల్‌, పవర్‌, కొన్ని ఆటో రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బుధవారం సెన్సెక్స్‌ 285.94 పాయింట్లు లాభపడి 81,741.34 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 372.64 పాయింట్ల మేరకు దూసుకుపోయి 81,828.04 పాయింట్లను తాకింది. అలాగే నిఫ్టీ 24,969.35 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకి చివరికి 93.85 పాయింట్ల లాభంతో 24,951.15 వద్ద ముగిసింది. రెండు సూచీలు ఇంట్రాడేలోను, ముగింపులోనూ చారిత్రక గరిష్ఠ స్థాయిలే నమోదు చేశాయి. సెన్సెక్స్‌ షేర్లలో 20 లాభపడగా 10 నష్టాలతో ముగిశాయి.


మరో కొత్త శిఖరంపై మార్కెట్‌ విలువ: బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ మరో కొత్త శిఖరాన్ని అధిరోహించింది. వరుసగా నాలుగో రోజు కూడా ఏర్పడిన ర్యాలీతో ఇది జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.462.38 లక్షల కోట్లకు (5.52 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.

ఆగస్టు 6న రెండు ఐపీఓలు: ఈ నెల 6వ తేదీన రెండు ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో ఒకటి ఫస్ట్‌క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీ్‌స సొల్యూషన్స్‌ ఇష్యూ కాగా రెండోది యునికామర్స్‌ ఈ-సొల్యూషన్స్‌ ఇష్యూ. రెండూ ఆగస్టు 8వ తేదీనే ముగుస్తాయి. బ్రెయిన్‌బీ్‌స సొల్యూషన్స్‌ రూ.1,666 కోట్ల విలువ గల తాజా ఈక్విటీ షేర్లు మార్కెట్లో జారీ చేయనుంది.

Updated Date - Aug 01 , 2024 | 04:46 AM

Advertising
Advertising
<