కార్ల తయారీలో మారుతి రికార్డు
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:38 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) ఒక క్యాలెండర్ సంవత్సరంలో 20 లక్షల యూనిట్ల తయారీ మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. అలాగే సుజుకీ మోటార్...
ఒక ఏడాదిలో 20 లక్షల కార్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) ఒక క్యాలెండర్ సంవత్సరంలో 20 లక్షల యూనిట్ల తయారీ మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. అలాగే సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా గల తయారీ కేంద్రా ల్లో కూడా ఈ మైలురాయి అధిగమించింది మారుతి సుజుకీ ఒక్కటే. 20 లక్షల ఉత్పత్తిగా ఎర్టిగా కారును మనేసార్ ప్లాంట్ నుంచి విడుదల చేశారు. ఈ 20 లక్షల కార్లలో 60 శాతం హరియాణా ప్లాంట్లలో త యారు కాగా 40 శాతం గుజరాత్‌లో తయారయ్యాయి.
Updated Date - Dec 18 , 2024 | 01:38 AM