రిలయన్స్, డిస్నీ మీడియా ఆస్తుల విలీనం పూర్తి
ABN, Publish Date - Nov 15 , 2024 | 03:04 AM
అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన భారత ఆస్తులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా వ్యాపారం విలీన ప్రక్రియ పూర్తయింది. తద్వారా రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ (జేవీ)గా అవతరించింది. ఆర్‌ఐఎల్ అధిపతి....
రూ.70,352 కోట్ల విలువైన జేవీ ఏర్పాటు
విలీన సంస్థ చైర్మన్‌గా నీతా అంబానీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన భారత ఆస్తులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా వ్యాపారం విలీన ప్రక్రియ పూర్తయింది. తద్వారా రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ (జేవీ)గా అవతరించింది. ఆర్‌ఐఎల్ అధిపతి ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ జేవీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. డిస్నీకి చెందిన ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ హోదాలో జేవీకి వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తారు. విలీన ఒప్పందంలో భాగంగా ఈ జేవీ వ్యాపారాభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.11,500 కోట్లు సమకూర్చింది. ఈ విలీన సంస్థ ఆర్‌ఐఎల్ నియంత్రలో ఉండనుంది. సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం, తన మీడియా అనుబంధ విభాగమైన వయాకామ్ 46.82 శాతం, డిస్నీ 36.84 శాతం వాటా కలిగి ఉంటాయి.
Updated Date - Nov 15 , 2024 | 03:04 AM