సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలు మించొద్దు
ABN, Publish Date - Jul 10 , 2024 | 02:15 AM
సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్స్) సంస్థలు మంజూరు చేసే రుణాలకూ పరిమితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి ఒక్కో రుణ గ్రహీతకు ఇచ్చే రుణాలను రూ.2 లక్షలకు పరిమితం చేయాలని...
కోల్‌కతా: సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్స్) సంస్థలు మంజూరు చేసే రుణాలకూ పరిమితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి ఒక్కో రుణ గ్రహీతకు ఇచ్చే రుణాలను రూ.2 లక్షలకు పరిమితం చేయాలని ఈ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ (ఎంఎఫ్‌ఐఎన్) కోరిం ది. అలాగే వీరికి రుణాలు ఇచ్చే సూక్ష్మ రుణ సంస్థలనూ నాలుగుకు పరిమితం చేయాలని సూచించింది. కుటుంబ ఆదాయం, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే స్థోమత ఆధారంగానే వీరికి రుణాలు ఇవ్వా లని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి ఎడా పెడా అప్పులు తీసుకుని.. తిరిగి చెల్లించేటప్పుడు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్‌ఐఎన్ ఈ సూచనలు చేయడం విశేషం.
Updated Date - Jul 10 , 2024 | 02:15 AM