ఇక విశ్లేషకులపై స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణ
ABN, Publish Date - May 03 , 2024 | 05:54 AM
రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజర్లపై నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనావళిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది...
న్యూఢిల్లీ: రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజర్లపై నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనావళిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. దీని కింద అనలిస్టులు, అడ్వైజర్ల పర్యవేక్షణకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారం ఇస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఆర్‌ఏఏఎ్‌సబీ), ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఐఏఏఎ్‌సబీ) పేరిట గుర్తింపు ఇస్తారు. ఈ గుర్తింపు సాధించాలంటే సంబంధిత ఎక్స్ఛేంజీ 15 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదై ఉండాలి. అలాగే కనీస నికర విలువ రూ.200 కోట్లు కలిగి ఉండి, దేశవ్యాప్తంగా 20 నగరాల్లో టెర్మినల్స్, ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే భౌతికంగా ఫిర్యాదుల పరిష్కార విభాగం, ఆన్‌లైన్‌లో వివాదాల పరిష్కార విభాగం నిర్వహిస్తూ ఉండాలి.
Updated Date - May 03 , 2024 | 05:54 AM