ఎంఎ్‌సఎంఈలకు ఇక సమయానికి చెల్లింపులు
ABN, Publish Date - Apr 01 , 2024 | 01:32 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక పరిస్థితి కొంత మేరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి సరుకులు, సేవలు పొందిన పెద్ద కంపెనీలు అందుకు...
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక పరిస్థితి కొంత మేరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి సరుకులు, సేవలు పొందిన పెద్ద కంపెనీలు అందుకు సంబంధించిన చెల్లింపులు ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో పూర్తి చేయాలి. ఈ నిబంధన సోమవారం (2024 ఏప్రిల్ 1) నుంచే అమల్లోకి రానుంది. ఒకవేళ ఏ పెద్ద కంపెనీ అయినా ఈ బకాయిలను 45 రోజుల కంటే ఆలస్యంగా చెల్లిస్తే, ఆ మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించదు. ఎగుమతి ఆధారిత సంస్థలతో పాటు అనేక కంపెనీలు ఈ నిబంధన అమలు ఏడాది పాటు వాయిదా వేయమని కోరినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
Updated Date - Apr 01 , 2024 | 01:32 AM