ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ

ABN, Publish Date - Jan 12 , 2024 | 03:30 PM

భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలోకి తిరిగి ప్రవేశించారు. గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు గణనీయంగా వృద్ధి చెందడంతో ఆయన సంపద పెరిగింది.

ముంబై: భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తిరిగి 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలోకి ప్రవేశించారు. గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు గణనీయంగా వృద్ధి చెందడంతో ఆయన సంపద పెరిగింది. ఒకే ఒక్క రోజు ఆయన ఆస్తి విలువ 2.76 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన 12వ స్థానానికి చేరారని ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక పేర్కొంది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీని ముకేశ్ అంబానీ అధిగమించారని, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారని రిపోర్ట్ పేర్కొంది.

కాగా గత కొన్ని రోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈ సానుకూల ప్రభావంతో ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా 5.47 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. గత 5 ట్రేడింగ్ సెషన్లలో రిల్ షేర్లు దాదాపు 3 శాతం, గత నెల రోజుల వ్యవధిలో 12 శాతం మేర పెరిగాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18.40 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.


ఇటీవలే నాన్-బ్యాంకింగ్ కంపెనీ ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్’‌ను (జేఎఫ్ఎస్ఎల్) ప్రధాన కంపెనీ నుంచి విభజించి ప్రత్యేకంగా లిస్టింగ్ చేయడం బాగా కలిసొచ్చింది. బీఎస్‌ఈపై జేఎఫ్ఎస్ఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ షేర్లు లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి. ఈ ప్రభావంతో ముకేశ్ అంబానీ సంపద కూడా పెరిగింది.

ఇక ప్రపంచ సంపన్నుల జాబితాలో ఏకంగా 212 బిలియన్ డాలర్లతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అమెజాన్‌ అధినేత జెఫ్ బెజోస్ (180 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ (164 బిలియన్ డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 96.2 బిలియన్ డాలర్లతో 14వ స్థానంలో నిలిచారు.

Updated Date - Jan 12 , 2024 | 03:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising