మురిపించిన ‘మూరత్’
ABN, Publish Date - Nov 02 , 2024 | 06:28 AM
శుక్రవారం జరిగిన మూరత్ ట్రేడింగ్‌తో దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది.
లాభాలతో ముగిసిన సూచీలు
ముంబై : శుక్రవారం జరిగిన మూరత్ ట్రేడింగ్‌తో దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. గంట సేపు సాగిన మూరత్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 335.06 పాయింట్ల లాభంతో 79,724.12 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304.35 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ వర్గాలు నూతన సంవత్సరంగా పరిగణించే ‘సంవత్, 2081’ ప్రారంభ శుభవేళ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మూరత్ ట్రేడింగ్ జరిగిగింది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు ఈ సెషన్‌లో మంచి లాభాలతో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 80,023.75 పాయింట్ల ఇంట్రా డే గరిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లు లాభాలతో ముగియగా, నిప్టీలోని 50 కంపెనీల షేర్లలో 42 లాభాల బాట పట్టాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా, మూరత్ ట్రేడింగ్‌లో భారత మార్కెట్ లాభాల బాట పట్టడం విశేషం.
సంవత్, 2080లో లాభాలే: అక్టోబరు నెల దేశీయ స్టాక్ మార్కెట్‌కు పెద్దగా కలిసి రాలేదు. ఎఫ్‌పీఐల ఎడతెగని అమ్మకాలతో సెన్సెక్స్ 4,910.72 పాయింట్లు (5.82 శాతం), నిఫ్టీ 1,605.5 పాయింట్లు (6.22 శాతం) నష్టపోయాయి. అయినా 2080 సంవత్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 14,484.38 పాయింట్లు (22.31 శాతం), నిఫ్టీ 4,780 పాయింట్ల (24.6 శాతం) లాభాలతో ముగిశాయి. దీంతో బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ రూ.1234.42 లక్షల కోట్లు పెరిగి రూ.444.71 లక్షల కోట్లకు చేరింది.
Updated Date - Nov 02 , 2024 | 06:28 AM