మస్క్ @: 447 బిలియన్ డాలర్లు
ABN, Publish Date - Dec 13 , 2024 | 02:38 AM
ప్రపంచ కుబేరుడు, అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద సరికొత్త రికార్డు స్థాయికి పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్‌టైం ఇండెక్స్ ప్రకారం...
ప్రపంచంలో ఈ స్థాయి సంపద కలిగిన తొలి వ్యక్తిగా టెస్లా అధిపతి సరికొత్త రికార్డు
ఒక్కరోజే 5.33 లక్షల కోట్లు పెరిగిన ఆస్తి
మొత్తం 37.93 లక్షల కోట్లకు చేరిక
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద సరికొత్త రికార్డు స్థాయికి పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్‌టైం ఇండెక్స్ ప్రకారం.. బుధవారం మస్క్ ఆస్తి ఏకంగా 62.8 బిలియన్ డాలర్లు (6,280 కోట్ల డాలర్లు = రూ.5.33 లక్షల కోట్లు) పెరిగి మొత్తం 447 బిలియన్ డాలర్లకు(44,700 కోట్ల డాలర్లు= రూ.37.93 లక్షల కోట్లు) చేరుకుంది. ప్రపంచంలో 400 బిలియనీర్ల వ్యక్తిగత సంపద కలిగిన తొలి వ్యక్తి ఈయనే. ఈ ఏడాదిలో మస్క్ నెట్‌వర్త్ 218 బిలియన్ డాలర్ల మేర పుంజుకుంది. ప్రధానంగా గత నెల 5న జరిగిన అమెరికా ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మస్క్ కంపెనీల షేర్ల ధరలతో పాటు ఆయన ఆస్తి శరవేగంగా పెరుగుతూ వచ్చింది.
ఎన్నికల్లో ట్రంప్‌కు మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు. ఆయన కోసం భారీగా ఖర్చు కూడా చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలక పాత్ర పోషించనుండటం కూడా తన కంపెనీ షేర్లకు గిరాకీ అమాంతం పెంచింది. ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి టెస్లా షేరు ధర 65 శాతం వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శనం.
Updated Date - Dec 13 , 2024 | 02:38 AM