ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hindenburg: సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ఏఎమ్ఎఫ్ఐ ఆగ్రహం

ABN, Publish Date - Aug 11 , 2024 | 08:24 PM

భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌పై ఆరోపణలు గుప్పించిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అసోసియేషన్‌ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశీయ మార్కెట్ వ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బకొట్టేందుకు హిండెన్‌బర్గ్ ప్రయత్నిస్తోందని మండిపడింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌పై ఆరోపణలు గుప్పించిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై (Hindenburg Research) అసోసియేషన్‌ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశీయ మార్కెట్ వ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బకొట్టేందుకు హిండెన్‌బర్గ్ ప్రయత్నిస్తోందని మండిపడింది.

అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్‌కు వాటాలు!


దేశ ఆర్థికాభివృద్ధిపై దెబ్బకొట్టేందుకు, సెబీ చైర్‌పర్సన్ పాత్రపై అనుమానాలు రేకెత్తించేందుకు హిండెన్‌బర్గ్ సంచలనం సృష్టించేందుకు ప్రయత్నించిందని ఏఎమ్ఎఫ్ఐ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇలాగే వదిలేస్తే ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొంది. కష్టపడి సాధించుకున్న దేశ ఆర్థికాభివృద్ధి ప్రతీకను మసక బార్చే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంది. భారత్ మార్కెట్ వ్యవస్థ దృఢమైనదని, వ్యవస్థపై భాగస్వాములు నమ్మకం కోల్పోకూడదని పేర్కొంది. అద్భుత మార్కె్ట్‌ను సృష్టించేందుకు ప్రస్తుత సెబీ నాయకత్వం ఎంతో చేసిందని, దీనిపై స్థానిక, అంతర్జాతీయ మదుపర్లకు ఎంతో విశ్వాసం ఉందని పేర్కొంది.

కాగా, హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చైర్‌పర్సన్ మాధబి బచ్ కూడా స్పందించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని, తన వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడుతోందని అన్నారు.

Read Business and Telugu News

Updated Date - Aug 11 , 2024 | 08:24 PM

Advertising
Advertising
<