Mutual Funds: రెండు నెలల్లో 81 లక్షలు.. మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ పెరుగుదల
ABN, Publish Date - Jun 17 , 2024 | 12:47 PM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మ్యూచువల్ ఫండ్ మదుపర్ల అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. రెండు నెలల్లోనే 81 లక్షల మంది కొత్తగా ఎంఎఫ్ ఖాతా తీసుకున్నారు.
ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మ్యూచువల్ ఫండ్ మదుపర్ల అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. రెండు నెలల్లోనే 81 లక్షల మంది కొత్తగా ఎంఎఫ్ ఖాతా తీసుకున్నారు. యాంఫీ గణాంకాల ప్రకారం.. మే చివరి నాటికి మొత్తం మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య సుమారు 18.59 కోట్లుగా ఉంది.
మార్చి చివరినాటి 17.78 కోట్లతో పోలిస్తే ఈ సంఖ్య 4.6 శాతం ఎక్కువ. అంటే 81లక్షలకుపైనే అనమాట. మే నెలలో కొత్తగా 45 లక్షల ఖాతాలు యాడ్‌కాగా.. ఏప్రిల్‌లో 36.11 లక్షల కొత్త అకౌంట్లు రిజిస్టర్ అయ్యాయి. 2023లో సగటున నెలకు 22 లక్షల కొత్త ఖాతాలు యాడ్ అయ్యేవి.
2024 మే నెలలో కొత్త వారి సంఖ్య ఇందుకు డబల్ కావడం గమనార్హం. మార్కెట్ స్థిరంగా ఉండటంతో ఇది సాధ్యమైందని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్ రన్, పటిష్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులు, నిరంతర పెట్టుబడిదారులు, స్థిరమైన మార్కెటింగ్ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నారు.
Updated Date - Jun 17 , 2024 | 12:47 PM